ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

ABN , First Publish Date - 2020-05-13T07:25:01+05:30 IST

జిల్లాలోని ప లు ఆసుపత్రుల్లో మంగళవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్‌ జనరల్‌

ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

నిజామాబాద్‌ అర్బన్‌, మే 12: జిల్లాలోని ప లు ఆసుపత్రుల్లో మంగళవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్‌ జనరల్‌ ఆసుపత్రిలో నిర్వహిం చిన కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెం ట్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రావు నర్సులను సన్మానించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న ర్సుల సేవలు ఎప్పటికీ మరిచిపోలేనివని, తల్లి కడుపులో నుంచి పుట్టిన బిడ్డను మొదట ము ద్దాడేది నర్సు అని జ్ఞాపకం చేశారు. కరోనా కా లంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న న ర్సులందరికీ శతకోటి వందనాలన్నారు. కార్యక్ర మంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములు, వైద్యులు జలిగం గోపాల్‌, గోపాల్‌సింగ్‌, బాల్‌రాజ్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పార్వతి తదితరులు పాల్గొన్నారు. 


ఇంద్రాపూర్‌ పీహెచ్‌సీలో

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని ఇంద్రాపూ ర్‌ పీహెచ్‌సీలో నర్సులను మేయర్‌ దండు నీతూ కిరణ్‌ సన్మానించారు. కరోనా సమయం లో కుటుంబాలను విడిచి సేవలందిస్తున్న నర్సు ల త్యాగాలు వెలకట్టలేనివని ఆమె అన్నారు. 


బోధన్‌ ఆసుపత్రిలో..

బోధన్‌ ఏరియా ఆసుపత్రి లో ఆరోగ్య జ్యోతి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యం లో నర్సులను ఘనంగా సన్మానించారు. కార్యక్ర మానికి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అ న్నపూర్ణ ముఖ్యఅతిథిగా హాజరై.. నర్సుల సేవ లు అభినందనీయమన్నారు. కరోనా సమయం లో నర్సులు ధైర్యంగా కుటుంబ సభ్యులను లె క్క చేయకుండా రోగుల ప్రాణాలను కాపాడాల నే ఉద్దేశంతో విధులు నిర్వర్తిసున్నార ని కొని యాడారు. కార్యక్రమంలో ఆర్‌ఎంవో సందీప్‌, డాక్టర్‌ శారద, రహీం, సోఫి, ట్రస్ట్‌ వ్యవస్థాపకు డు ఎంఎఫ్‌ రాజు, ఆరోగ్యజ్యోతి, క్రాంతి, ప్రశాం త్‌, అమర్‌, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 


జక్రాన్‌పల్లిలో..

నర్సుల దినోత్సవం సందర్భంగా మండలంలోని పీహెచ్‌సీలో నర్సులను అర్గుల్‌ సర్పంచ్‌ గోర్త పద్మ, ఉప సర్పంచ్‌ రాజేందర్‌ స త్కరించారు. కార్యక్రమంలో హెల్త్‌ ఆఫీసర్‌ సా యన్న, ల్యాబ్‌ టెక్నీషియన్‌ ప్రవీణ్‌ పాల్గొన్నారు.


కోటగిరి మండల పరిషత్‌లో...

కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా వైద్య సిబ్బంది ఎంతగానో కృషి చేశార ని ఎంపీపీ సునీత కొనియాడారు. కోటగిరి మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం వైద్య సిబ్బందికి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు ఉమ, సుజాత, లక్ష్మీ, జ్యోతి, సరిత, వైస్‌ఎంపీపీ గంగాధర్‌పటేల్‌ తదితరులున్నారు.

Read more