12 నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

ABN , First Publish Date - 2020-05-09T11:15:15+05:30 IST

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్ష పత్రాల మూ ల్యాంకనం ఈనెల 12 నుంచి నిర్వహించనున్నారు.

12 నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

నిజామాబాద్‌ అర్బన్‌, మే 8: జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్ష పత్రాల మూ ల్యాంకనం ఈనెల 12 నుంచి నిర్వహించనున్నారు. ఇంటర్‌ బోర్డు ఆదేశాల మేర కు జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు అదికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదివరకు ఒక్క కేంద్రంలోనే మూల్యాంకనం నిర్వహించేవారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలతో కేంద్రాలను పెంచారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా బాలుర కళాశాలతో పాటు కంఠేశ్వర్‌లోని ఉమెన్స్‌ కళాశాల, ఆర్యనగర్‌లోని ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో 12, 13, 14 తేదీలలో మూల్యాంకనం నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


లాక్‌డౌన్‌ నిబంధనలతో పాటు కరోనా నివారణ చర్యల్లో భాగంగా అన్ని నిబంధనలను పాటిస్తూ మూల్యాంకనాన్ని పూర్తిచేసేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక గదిలో ఒక్కో టేబుల్‌కు ఒక్కో అధ్యాపకుడు కూ ర్చొని మూల్యాంకనం చేసే విధంగా ఏర్పాట్లు  చేస్తున్నారు. శానిటైజర్‌లతో పాటు మాస్కులు ధరించడం, గదులను శానిటైజేషన్‌ చేయడం వంటి ఏర్పాట్లు సైతం చేస్తున్నారు.


ఈనెల 12న ఇంగ్లిష్‌, సంస్కృతం, గణితం, ఫిజిక్స్‌, 13వ తేదీన ఫిజి క్స్‌, కెమిస్ట్రీ, కామర్స్‌, ఎకనామిక్స్‌, 14వ తేదీన తెలుగు, బాటనీ, జువాలజీ, హిందీ, చరిత్ర పేపర్‌లు దిద్దేవిధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట ద్వితీ య సంవత్సరం పేపర్‌లను తర్వాత మొదటి సంవత్సరం పేపర్లను మూల్యాంక నం చేయనున్నారు. సుమారు వెయ్యి మంది అధ్యాపకులు ఈ మూల్యాంకనంలో పాల్గొననున్నారు.

Updated Date - 2020-05-09T11:15:15+05:30 IST