జిల్లాలో జీరో
ABN , First Publish Date - 2020-05-17T09:56:02+05:30 IST
జిల్లాలో కరోనా బాఽధితుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కరోనా పాజిటివ్‌తో హైదరాబా ద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స

జిల్లాలో జీరోకు చేరిన కరోనా బాధితుల సంఖ్య
ఫలితాన్నిచ్చిన అధికారుల కట్టడి ప్రయత్నాలు
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చివరి కరోనా బాధితుడి డిశ్చార్జి
జిల్లా ప్రజల సహకారంతోనే కరోనా రహిత జిల్లాగా మారిందన్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
ఇంతటితో ఆగిపోలేదన్న కలెక్టర్ నారాయణరెడ్డి
రక్షణ చర్యలు తప్పకుండా పాటించాలని సూచన
నిజామాబాద్ అర్బన్, మే 16: జిల్లాలో కరోనా బాఽధితుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కరోనా పాజిటివ్‌తో హైదరాబా ద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతు న్న చివరి వ్యక్తి శనివారం డిశ్చార్జ్ అయ్యాడు. జిల్లాలో మొత్తం 61 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, వారంతా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. వీరిలో కొంతమంది ఇదివరకే ఆసుపత్రి నుంచి డి శ్చార్జ్ కాగా, మిగిలిన ఒక్క వ్యక్తి శనివారం డి శ్చార్జ్ అయ్యాడు. అలాగే దాదాపు నెలరోజులు గా జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమో దు కాలేదు.
దీంతో జిల్లా కరోనా ఫ్రీ జిల్లాగా మారింది. ఈ విషయంపై కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలందరి సహకారంతో నే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. అయితే, కరోనా ఉపద్రవం ఇంతటితో ముగిసిపోలేదని, ఆయన అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి నియంత్రణకు ప్రతీ ఒక్కరు మరిన్ని జాగ్రత్త లు తీసుకోవాలన్నారు. అలసత్వం వహిస్తే మ ళ్లీ విజృంభిస్తుందన్నారు. ప్రజలంతా మాస్కు లు, శానిటైజర్లు తప్పక ఉపయోగించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. జిల్లాలోని కంటైన్మెంట్ క్లస్టర్లు తొలగించామని, ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటిస్తే జిల్లా ఆరెంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్‌లోకి మారుతుందన్నారు.