అక్రమంగా రాళ్లు తరలిస్తున్నారని ఫిర్యాదు.. మైనింగ్ అధికారుల తనిఖీలు
ABN , First Publish Date - 2020-12-30T04:51:27+05:30 IST
రూరల్ మండలం మల్కాపూర్ (ఎ) పరిధిలోని క్రషర్‌ను మైనింగ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది తనిఖీ చేశారు.
నిజామాబాద్ రూరల్, డిసెంబరు 29: రూరల్ మండలం మల్కాపూర్ (ఎ) పరిధిలోని క్రషర్‌ను మైనింగ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది తనిఖీ చేశారు. కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని పలు క్రషర్‌లను తనిఖీ చేసినట్లు మైనింగ్ ఏడీ సత్యనారాయణ తెలిపారు. గుండారం-మల్కాపూర్ (ఎ) పరిఽధిలోని క్రషర్‌లలో అక్రమంగా రాళ్లు తరలిస్తున్నారని, మల్కాపూర్ గుట్ట నుంచి పెద్దరాళ్లను తరలిస్తున్నారన్న ఫిర్యాదుమేరకు తనఖీలుచేశారు. క్రషర్ ఆవరణలో ఉన్న రాళ్లను, కంకరను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మల్కాపూర్ శివారులో జరుగుతున్న నిర్మాణాల నుంచి బయటకు తీసిన పెద్ద రాళ్లను ట్రాక్టర్ల ద్వారా అక్కడి నుంచి తీసుకెళ్తున్నట్లు వడ్డెరలు తెలిపారు. అధికారుల అనుమతితోనే రాళ్లను తీసుకెళ్తున్నారని, అక్రమంగా బ్లాష్టింగ్‌లు జరగడం లేదని మైనింగ్, రెవెన్యూ అధికారులు తెలిపారు. సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామపెద్దలు, వడ్డెర సంఘం పెద్దలు ఉన్నారు.