ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు
ABN , First Publish Date - 2020-11-03T10:42:39+05:30 IST
జిల్లాలో ప్రైవేట్ ఆసుప త్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లలో సోమవారం తనిఖీలు పో గ్రాం ఆఫిసర్ శిరిష తనీఖీలు చేపట్టారు. కొవిడ్, సీజనల్ వ్యాధుల పేరిట ప్రజలను బురిడి కొట్టిస్తూ అధికంగా డబ్బు లను వసూలు చేయడమే
ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో
వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తనిఖీలు
కామారెడ్డిటౌన్, నవంబరు 2: జిల్లాలో ప్రైవేట్ ఆసుప త్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లలో సోమవారం తనిఖీలు పో గ్రాం ఆఫిసర్ శిరిష తనీఖీలు చేపట్టారు. కొవిడ్, సీజనల్ వ్యాధుల పేరిట ప్రజలను బురిడి కొట్టిస్తూ అధికంగా డబ్బు లను వసూలు చేయడమే కాకా నిబంధనలు పాటించకుం డా ధరల పట్టికలను ఏర్పాటు చేయకుండా బీపీ, షుగర్ పరీ క్షలు చేసి వందల్లో ఫీజులు వసూలు చేయడం, అవసరం లే కున్నా స్కానింగ్‌లు, రోగనిర్ధారణ పరీక్షలు చేయడంపై ‘ఆంధ్రజ్యోతిలో పైసా వసూల్’ కథనం ప్రచురితమైంది. ఈ కథనంతో జిల్లా వైద్యఆరోగ్యశాఖలో కదలిక మొదలైంది. సో మవారం పలు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లలలో తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్బంగా పోగ్రాం ఆఫీసర్ శిరిష మాట్లాడుతూ కామారెడ్డిలోని ఎన్‌జీవోస్ కాలనీలోని ప్రైవేట్ ఆసుపత్రులను, డయాగ్నస్టిక్ సెంటర్‌లను తనిఖీ చేసినట్లు తెలిపారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనల ను పాటించాలని, సేవల వివరాలు, ధరల పట్టిక, రిసెప్షన్ సెంటర్‌లో తెలుగు, ఇంగ్లీష్‌లో ధరల సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు పా టించాలని, బయోమెడికల్ వెస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలు తప్పకపాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగరాజ్‌గౌడ్, సంజీవ్‌రెడ్డి, రాణి తదితరులు పాల్గొన్నారు.