పెరగనున్న విద్యుత్ వినియోగం
ABN , First Publish Date - 2020-12-11T04:52:09+05:30 IST
నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాగుకు విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరుతడి పం టలతో పాటు వరికి నిరంతరాయంగా విద్యుత్ సరఫ రా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని వి ద్యుత్ కనెక్షన్‌లకు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్‌లకు మ రమ్మతు చేయడంతో పాటు అవసరమున్న మేరకు కొ త్తవాటిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అను గుణంగా 24 గంటల కరెంటును అందిస్తున్నారు. ఈ నె లాఖరు నుంచి విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉండడంతో విద్యుత్ లైన్‌లను కూడా సరిచేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు అందించే విధంగా ఏ ర్పాట్లు చేశారు.

నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాగుకు విద్యుత్ శాఖ అధికారుల ఏర్పాట్లు
జనవరి నుంచి మార్చి వరకు పెరగనున్న విద్యుత్ వినియోగం
నిజామాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాగుకు విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరుతడి పం టలతో పాటు వరికి నిరంతరాయంగా విద్యుత్ సరఫ రా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని వి ద్యుత్ కనెక్షన్‌లకు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్‌లకు మ రమ్మతు చేయడంతో పాటు అవసరమున్న మేరకు కొ త్తవాటిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అను గుణంగా 24 గంటల కరెంటును అందిస్తున్నారు. ఈ నె లాఖరు నుంచి విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉండడంతో విద్యుత్ లైన్‌లను కూడా సరిచేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు అందించే విధంగా ఏ ర్పాట్లు చేశారు. జిల్లాలో యాసంగిలో 5 లక్షల 13 వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయాధికారు లు అంచనా వేశారు. ప్రభుత్వానికి పంపించారు. జిల్లా లో ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ఆయకట్టుతో పాటు అన్ని గ్రామాల పరిధిలో ఆరుతడి పంటలతో పాటు వరిని సాగు చేస్తున్నారు. ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందుతుండగా మిగతా ప్రాంతాల్లో బోర్లపై నే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. రైతులు రెం డు పంటలు పండిస్తున్నారు. వానాకాలం లాగే యాస ంగిలో కూడా ఇప్పటి వరకు లక్షన్నర ఎకరాలకు పైగా ఆరుతడి పంటలను రైతులు సాగుచేశారు. శనగ, ను వ్వులు, ఎర్రజొన్న, జొన్న, సజ్జ, మొక్కజొన్నతో పాటు ఇ తర పంటలను వేశారు. వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు వాటి నుంచి సాగునీరు అందుతుంది. మిగతా ప్రాంతాల్లో బోర్ల ద్వారానే పంటలను వేస్తున్నారు.
జిల్లాలో లక్షా 70వేల పంపు సెట్‌లు
జిల్లాలో మొత్తం లక్షా 70వేల పంపుసెట్‌లు ఉన్నా యి. వీటి పరిధిలోనే మొత్తం ఆయకట్టు సాగవుతుంది. ప్రాజెక్టుల నీళ్లు అందే ప్రాంతాల్లో కూడా పంపుసెట్‌లు ఉన్నాయి. ప్రాజెక్టు నుంచి నీళ్లందని సమయంలో ఈ పంపుసెట్‌లను వినియోగించి పంటలకు నీరందిస్తున్నారు. యాసంగి సాగు గత నెలలోనే మొదలుకావడ ంతో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖాధికారులు పంటలకు నీరందించేందుకు ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ పంపుసెట్లన్నింటికీ 24 గంటల పాటు నిరంతరం విద్యుత్ అందే విధంగా లైన్‌లను సిద్ధం చేశారు. పంటలు వేసి విద్యుత్ వినియో గం ఎక్కువగా ఉన్న సమయంలో కూడా లోడ్ పడకు ండా ఉండే విధంగా మరమ్మతులు చేశారు. ప్రతి ట్రా న్స్‌ఫార్మర్ పరిధిలో 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటార్లకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా అయ్యే విధంగా సిద్ధం చేశారు. లూజు లైన్‌లను కూడా మరమ్మతులు చేయడంతో పాటు రైతుల పంటలకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. ఏ గ్రా మం పరిఽధిలోనైనా ఇబ్బందులు వస్తే వెంటనే మరమ్మతులు చేసేందుకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌లను కూడా అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం వేసిన ఆరుతడి పంటలకు ఇబ్బందులు లేకుండా కరెంటు సరఫరాను చేస్తున్నారు. భూగర్భజలాలు ఎక్కువగా ఉండడం వల్ల వినియోగం కూడా పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో ప్రతీరోజు 8 మిలియన్‌ల యూనిట్‌ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రతీరోజు పది మిలియన్‌ల వరకు విద్యుత్ వినియోగం జరుగుతుదని అ ధికారులు అంచనా వేశారు. ప ంటలు చివరి దశకు వచ్చే మా ర్చి నెలలో కూడా విద్యుత్ వినియోగం మరింత పెరుగుతుంద ని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో వరి ఎక్కువగా సాగవుతున్నందున ఈ వినియోగం పె రుగుతుందని అంచనా వేస్తున్నా రు. సుమారు 3 లక్షల 80 వేల ఎక రాలకు పైగా వరి సాగు అయ్యే అ వకాశం ఉండడంతో ముందస్తుగా విద్యుత్ శాఖాధికారులు ఈ ఏర్పాట్లను చేశారు. జిల్లా పరిధిలో గత సీజన్‌లో జరిగిన విద్యుత్ వినియోగం ఛా ర్జీలను కూడా వసూలు చేస్తున్నారు. ప్రతి మోటారుకు సర్వీస్ ఛార్జీ కింద ఆ రు నెలలకు 360 రూపాయలను వసూ లు చేస్తున్నారు. ప్రతి సీజన్‌లో ఆరు కో ట్ల వరకు ఈ ఛార్జీల కింద వసూలు చే స్తున్నారు. గత సంవత్సరం కలుపుకుంటే ప్రస్తుతం 10 కోట్ల వరకు ఈ బకాయిలు ఉన్నాయి. అధికారులు కూడా గ్రామాలకు వెళ్లినప్పుడు జరిగే సమావేశాల్లో ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తుందని సర్వీస్ ఛార్జీలు మాత్రం రైతులు చెల్లించాలని కోరుతున్నారు. గత వానాకాలం సీజన్‌కు సంబంధించిన సర్వీస్ ఛార్జీలను రైతులు తప్పనిసరిగా చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పాట్లు
జిల్లాలో వరి సాగు పెరుగుతున్నందున ప్ర భుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందస్తుగా ఏర్పాట్లు చేశామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుదర్శన్ తెలి పారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ను అందిస్తున్నామన్నారు. జనవరి, ఫిబ్రవరి, మా ర్చి నెలల్లో వినియోగం ఎక్కువగా ఉంటుందని తె లిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. రైతులు నిర్ణీత స మయంలో కనెక్షన్‌కు రూ.360 చొప్పున సర్వీస్ ఛార్జీలు చెల్లించాలని ఆయన కోరారు. ఏవైనా సమస్యలుం టే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.