పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-01T10:07:05+05:30 IST

జిల్లాలో కరోనా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రతీరోజు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నవారు చికిత్స

పెరుగుతున్న కరోనా కేసులు

జిల్లా వ్యాప్తంగా 6,675కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

ఆసుపత్రుల్లో పెరుగుతున్న కరోనా బాధితులు


నిజామాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): 

జిల్లాలో కరోనా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రతీరోజు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నవారు చికిత్స కోసం ఆసుప త్రులకు పరుగులు పెడుతుండడంతో ప్రభుత్వ, ప్రైవే టు ఆసుపత్రుల్లో పడకల కోసం పైరవీలు చేసే పరిస్థి తి నెలకొంది. జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఎంత కోరినా పట్టించుకోకపోవడంతోనే ఎక్కువ మంది కరోనా బారినపడుతున్నారు. వారి కుటుంబాలకు కూ డా కరోనాను వ్యాప్తి చేస్తున్నారు. 


రవాణా ప్రారంభంతో పెరుగుతున్న కేసులు

జిల్లాలో కరోనా కేసులు మొదలై ఐదు నెలలు దాటిం ది. జూన్‌ నుంచి అంతరాష్ట్ర రవాణా పెరగడంతో కేసు ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆగస్టు నెలలో భారీగా పెరిగింది. కొవిడ్‌ తీవ్రత పెరుగుతుండడంతో గడిచిన పది రోజులుగా జిల్లాలో టెస్టుల సంఖ్య పెంచారు. టెస్టుల సంఖ్య పెంచడంతో పెద్దఎత్తున కేసులు బయ టపడుతున్నాయి. జిల్లా వాసులు ఇతర ప్రాంతాల్లో పె ళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలకు వెళ్లివస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి.


బోధన్‌ డివిజన్‌లో ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. బయటికి వెళ్లి వచ్చిన వారి ద్వారా ఇంట్లోలో ఉన్న వారికి కరోనా వ్యాప్తి చెందుతోం ది. కట్టడి లేకపోవడం వల్ల ఆగస్టు నెలలో కేసుల సం ఖ్య బాగా పెరిగింది. గ్రామం నుంచి జిల్లా కేంద్రం వర కు మొత్తం కేసులలో 40 శాతం వరకు కేసులు ఈ ఒక్క నెలలోనే నమోదయ్యాయి. జిల్లాలో కరోనా ప్రార ంభం అయిన మార్చి నుంచి ఇప్పటి వరకు 39,630 మందికి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో ఈ పరీక్షల వల్ల 6,675 మందికి కరోనా పాజిటివ్‌ తేలింది. వీరిలో అధికార లెక్కల ప్రకారం కరోనాతో 69 మంది మృతి చెందారు. కరోనాతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉండటం వల్ల మరో 35 మంది చనిపోయారు. 


జిల్లా లో గడిచిన పది రోజులుగా ప్రతీరోజు సగటున రెండు వందల వరకు పాజిటివ్‌ కేసులు బయట పడుతున్నా యి. వైరస్‌ సామాజిక వ్యాప్తి వల్లనే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. ప్రపం చ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్‌ బృందం సభ్యులు కూడా జిల్లా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ట్లు వైద్యుల సమాచారం బట్టి తెలుస్తోంది.


పెరుగుతున్న బాధితుల సంఖ్య

జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆసుప త్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. లక్షణా లు ఎక్కువగా ఉన్నవారు ముందుగా ఆసుపత్రులలో చేరుతున్నారు. జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ వచ్చి న వారి కోసం 272 పడకలు ఏర్పాటు చేశారు. ఆగస్టు నెల ఆరంభం నుంచి 200 నుంచి 230 వరకు చికిత్స పొందుతున్నారు. జూన్‌, జూలై నెలలో వందకు లోపే చేరారు. ప్రస్తుతం బాగా పెరిగింది. ప్రైవేటు ఆసుపత్రు ల్లోనూ ఇంతే మొత్తంలో చేరుతున్నారు.


గతంతో పోల్చి తే బెడ్స్‌ కోసం ఫోన్లు చేయించుకునే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. ఆసుపత్రులలో ఎక్కువ మంది ఆందోళనతో చేరుతున్నారు. తీవ్రత వల్ల చికిత్సకు ఇబ్బందులు రావ ద్దని తమకు తెలిసిన నేతలు, అధికారుల ద్వారా సిఫార సు చేయించుకుంటున్నారు. జిల్లాతో పాటు హైదరాబా ద్‌ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరిగింది. లక్షణాలు తక్కువగా ఉన్నవారు మాత్రం హోంక్వారంటైన్‌లోనే ఉ ంటున్నారు. పాజిటివ్‌ వచ్చిన రోజే హోంక్వారంటైన్‌ కిట్‌ ను అందిస్తున్నారు.


జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో ఆగస్టు నెలలో ఎక్కువ మంది చేరారని సూపరింటెండెంట్‌ డా క్టర్‌ ప్రతిమారాజ్‌ తెలిపారు. ఆసుపత్రిలో చేరిన వారం దరికి తగిన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. వైద్యు లు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి సేవ లు అందిస్తున్నారని తెలిపారు. జిల్లాలో పరీక్షలో పాజి టివ్‌ వచ్చిన వారందరికి మందులు అందిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రమేష్‌ తెలిపారు. కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కోరారు. 


కొత్తగా మరో 284 కేసులు

 జిల్లాలో సోమవారం కొత్తగా మరో 284 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు జిల్లా వైద్య ఆరోగ్య శా ఖ అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం పా జిటివ్‌ కేసుల సంఖ్య 6,675కి చేరిందన్నారు. ఇందులో 4,736 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. ఇప్పటి వ రకు చికిత్స పొంది 1,835 మంది డిశ్చార్జి అయినట్టు  వారు తెలిపారు. అలాగే జిల్లాలో ఇప్పటి వరకు కరో నాతో మొత్తం 104 మంది మృతిచెందారని అధికారు లు తెలిపారు.


Updated Date - 2020-09-01T10:07:05+05:30 IST