ఇష్టారాజ్యం.. అడ్డగోలుగా కొనసాగుతున్న భవన నిర్మాణాలు
ABN , First Publish Date - 2020-07-08T22:17:16+05:30 IST
నిజామాబాద్ నగరంలో భవన నిర్మాణాలు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. సెట్బ్యాక్లు వదలకుండానే నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల వదిలివేస్తున్నా.. మరికొన్ని చోట్ల పట్టించుకోవడం లేదు.

మాస్టర్ ప్లాన్ మేరకు అనుమతులిచ్చినా.. సెట్బ్యాక్లు వదలని యజమానులు
ప్రధాన వాణిజ్య సముదాయాల పరిధిలోనూ ఇదే దుస్థితి
కనీసం వాహనాలు కూడా వెళ్లని పరిస్థితి
నిర్మాణదారులకు నేతల అండదండలు
ఒత్తిళ్లతో చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న కార్పొరేషన్ అధికారులు
నిజామాబాద్ (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ నగరంలో భవన నిర్మాణాలు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. సెట్బ్యాక్లు వదలకుండానే నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల వదిలివేస్తున్నా.. మరికొన్ని చోట్ల పట్టించుకోవడం లేదు. కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి రాకపోవడం పాత మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగానే నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఎక్కడైనా అధికారులు అడ్డుకున్నా ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఉండడంతో వెనకడుగు వేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు దృష్టి పెట్టినా ఒత్తిళ్లు ఉండడంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల ఫైన్లు వేసి నిర్మాణాలను నిలిపివేస్తున్నారు.
నగరంలో భవన నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగు తున్నాయి. కొత్త భవనాల నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కరోనా లాక్డౌన్ సమయంలో కొంత మే ర తగ్గినా తర్వాత భవన నిర్మాణాలు పెరిగాయి. మధ్య లో వదిలివేసిన భవన నిర్మాణాలను యజమానులు కొ నసాగిస్తున్నారు. అపార్ట్మెంట్లతో పాటు ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. నగర పరిధిలోని అన్ని భవనాల నిర్మాణాలు ఆన్లైన్లోనే అనుమతులను ఇస్తు న్నారు. అపార్ట్మెంట్లతో పాటు భవన నిర్మాణాలు చే సే వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత లైసెన్స్ సర్వేయర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం అనుమతులు ఇస్తున్నారు. ఈ ప్లాన్ల ద్వారా భవన నిర్మాణాలు కొన సాగిస్తున్నారు. నగరం పరిధిలో పలు గ్రామాలు విలీనమయ్యాయి. నగరంలో భూముల రేట్లు బాగా పెరిగాయి. దీంతో భవన నిర్మాణం చేసే వా రు ఎక్కువ మొత్తంలో నిబంధనల మేరకు సెట్ బ్యాక్లను వదిలివేయడం లేదు.
వాణిజ్య సముదాయాలు ని ర్మించే ఖలీల్‌వాడి, సరస్వతినగర్, ద్వారకానగర్, ఎల్ల మ్మగుట్ట, ప్రగతినగర్, కంఠేశ్వర్, సుభాష్‌నగర్, గాంధీచౌక్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో భూముల ధరలు ఎ క్కువగా ఉన్నాయి. గజం ధర 50 వేల నుంచి లక్ష రూ పాయలకుపైగా ఉంది. ఎక్కువ మొత్తంలో ధరలు ఉం డడం వల్ల కొనుగోలు చేసిన వారు ఉన్న భూమిలో ఈ నిర్మాణాలు చేస్తున్నారు. ఆసుపత్రులతో పాటు ఇతర నిర్మాణాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవే కాకుండా నగరంలోని పలు డివిజన్ల పరిధిలో అపార్ట్మెంట్లు, ఇతర నిర్మాణాలు అధికంగా వెలుస్తున్నాయి. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా వంద గజాలు దాటితే పది ఫీట్ల వరకు సెట్‌బ్యాక్‌ను భవన నిర్మాణాలు చేసే వా రు వదిలివేయాలి. చుట్టు 5 ఫీట్ల వరకు నిర్మాణాలను వదిలివేయాలి. ఆ తర్వాతే నిర్మాణం చేపట్టాలి. వాణిజ్యపరం గా అ భివృద్ధి చెందుతున్న నగరంలోని ప్రధానమైన కూడళ్లలో ఎవరూ సెట్‌బ్యాక్‌లను వ దలడం లేదు. తమకున్న పలుకుబడి ద్వారా పైరవీలు చేసుకుంటున్నారు. రాజకీయ నేతల ద్వారా ఒత్తిళ్లు తెచ్చి నిర్మాణాలు చేస్తు న్నారు.
ప్రజలకు తప్పని ఇబ్బందులు..
నగరంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో పాత భవనాలతో పాటు కొత్త భవనాలు వెలసినా రోడ్లు వెడల్పు కాకపోవడం వల్ల నిత్యం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొ ంటున్నారు. ప్రధాన రోడ్లలో కనీసం ద్విచక్రవాహనం కూడా వెళ్లని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రధాన వ్యాపార కూడళ్ల వద్ద ఉన్న భవనాల వద్ద పార్కింగ్ సౌకర్యం కూడా లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. భవన ని ర్మాణం చేసిన వారు సెల్లార్‌తో పాటు సెట్‌బ్యాక్‌లను వదిలివేయకపోవడం వల్ల ఆ ప్రాంతాలకు అవసరాల రీత్యా వచ్చే వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొత్త భవనాలను నిర్మాణం చేసేటప్పుడు మాస్టర్ ప్లాన్‌కు అ నుగుణంగా అనుమతులు ఇస్తున్నా ఆ తర్వాత వరుస తనిఖీలు లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నా యి. పలుకుబడితో భవన నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు. ఎక్కడైనా నిర్మాణాలను తనిఖీ చేసేందుకు అధి కారులు వెళితే రాజకీయ ఒత్తిళ్లు రావడంతో వెనకకు వే స్తున్నారు. అనుమతులు పక్కాగా ఉన్న ఆ తర్వాత సె ట్ బ్యాక్‌లు వదిలివేయకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి.
ఎప్పుడైనా అగ్నిప్రమాదాలు జరిగితే కనీసం వాహనాలు నిలిపే పరిస్థితి కూడా ప్రధాన వాణిజ్య సముదాయాల పరిధిలో లేదు. అపార్ట్మెంట్ లు కూడా నిర్మించే వారు ఎక్కువగా వదిలివేయడం లే దు. టౌన్‌ప్లానింగ్ విభాగం అన్ని అనుమతులు చూ స్తున్నా పరిస్థితులకు అనుగుణంగా వారు వ్యవహరిస్తున్నారు. ఒత్తిళ్లు ఉన్న చోట చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అన్ని ఆన్లైన్లో అనుమతులు ఇస్తున్నందు వల్ల తనిఖీలు ఎక్కువగా చేయడం లేదు. కొన్నిచోట్ల స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఉండడం వల్ల వెనకడుగు వేస్తున్నారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ని ర్మాణాలు చేస్తే భవిష్యత్తులో పెరగే జనాభాకు అనుగునంగా ఇబ్బందులు ఏర్పడని పరిస్థితులు ఉంటాయి. చూసీచూడనట్లు వ్యవహరిస్తే మరికొన్ని సంవత్సరాల్లో ప్రధాన వాణిజ్య సముదాయాల పరిధిలో వాహనాలు పోని పరిస్థితులు ఎదురుకానున్నాయి. కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి రానున్న ఈ సమయంలో నిర్మాణాలపైన దృష్టి పెట్టి సెట్‌బ్యాక్‌లను వదిలే విధంగా చూస్తే భవిష్యత్తులో మేలు జరిగే అవకాశం ఉంది. నగరం ప రిధిలో భవన నిర్మాణాలన్ని ఆన్లైన్లోనే అనుమతులిస్తున్నామని నగర కార్పొరేషన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్యాంకుమార్ తెలిపారు. నిబంధనల మేరకే అనుమతు లు ఇస్తున్నామన్నారు. అన్ని భవనాలకు సెట్బ్యాక్లు వదిలే విధంగా చూస్తున్నామని ఆయన తెలిపారు.