కరోనా తీవ్రతను తెలుసుకునేందుకు గ్రామాల్లో ఐసీఎంఆర్ బృందం సర్వే..
ABN , First Publish Date - 2020-12-30T05:09:35+05:30 IST
మండలంలోని చిన్నఎడ్గి గ్రామంలో మంగళవారం ఐసీఎంఆర్ బృందం సర్వే నిర్వహించారు.
జుక్కల్, డిసెంబరు 29: మండలంలోని చిన్నఎడ్గి గ్రామంలో మంగళవారం ఐసీఎంఆర్ బృందం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రశాంత్, విక్రంతో పాటు ఏఎన్‌ఎం సావిత్రి, ఆశ వర్కర్లు ఇంటింటా తిరుగుతూ కరోనా వైరస్ దృ ష్ట్యా గ్రామంలో పలువురి రక్త నమూనాలను సేకరించి, ల్యాబ్ లకు పంపుతామన్నారు. గతంలోనూ ఇలాగే రెండు సార్లు పరీ క్షలు హైదరాబాద్‌కు పంపించామన్నారు. ప్రస్తుతం కరోనా తీవ్రత ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి రక్త నమూనా లను సేకరిస్తున్నామని వివరించారు. గ్రామంలో 40 మంది నుంచి రక్త నమూనాలను సేకరించామన్నారు.
పెద్ద కొడప్‌గల్: మండల కేంద్రంలో మంగళవారం వైద్యు లు లక్ష్మణ్, అనంతన్ శరత్ ప్రసాద్ ఇంటింటికీ తిరుగుతూ ఐసీఎంఆర్ సర్వేను నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ ఇంటింటికీ తిరుగుతూ సర్వే నిర్వహిం చామని, మండలంలోని ఆయా గ్రామాల్లో వైద్య సిబ్బంది సర్వే నిర్వహిస్తారని, సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ పండరి, వైద్య సిబ్బంది తదితరులున్నారు.
నాగిరెడ్డిపేట: మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో మంగళ వారం ఐసీఎంఆర్ కేంద్ర బృందం సభ్యులు కొవిడ్ 19పై సర్వే జరిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు ధర్మారెడ్డి గ్రామాన్ని ఎంపిక చేసు కుని రక్త నమూనాలను సేకరించారు. టెస్టింగ్ కోసం చెన్సై ల్యాబ్‌కు పంపిస్తామన్నారు. 43 మంది వ్యక్తుల నుంచి రక్త నమూనాలను డాక్టర్ సమీరా వైద్య బృందం సభ్యులు సేకరిం చినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ నందిత తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మొదటి విడత గత మే నెలలో సర్వే జరుపగా, రెండో విడత ఆగస్టు నెలలో సర్వేలు జరిపారు. కాగా ప్రస్తుతం మూడో విడత తీసుకున్న రక్త న మూనాలను చెన్సైకి పంపుతామన్నారు. వీటికి సంబంధించిన ఫలితాలు త్వరలో వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఎం ఆర్ బృందం ల్యాబ్ టెక్నీషియన్ విజయలక్ష్మి, టెక్నికల్ అసిస్టె ంట్ సోను, వైద్య బృందం తదితరులున్నారు.