భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-12T05:03:05+05:30 IST
తాగుడు మానే యాలని భార్య మందలించడంతో మనస్థాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
తాగుడు మానేయాలని మందలించడంతో ఆత్మ చేసుకున్న వైనం
బీర్కూర్, డిసెంబరు 11: తాగుడు మానే యాలని భార్య మందలించడంతో మనస్థాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సం ఘటన జిల్లా కేంద్రంలోని బీర్కూర్ మండల కేంద్రంలోని పోచారంకాలనీలో చోటు చేసుకుం ది. ఎస్సై సతీష్‌వర్మ తెలిపిన వివరాల ప్రకా రం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన కుంభ నాగరాజు (33) మూడు నెలల క్రితం బతుకుదెరువు కో సం బీర్కూర్‌కు భార్య పిల్లలతో కలిసి వచ్చా డు. పోతరాజు అనే మేస్ర్తి వద్ద కూలీ పనికి చేరాడు. నాగరాజు తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగి భార్య లక్ష్మీతో గొడవపడే వాడు. నాగరాజు ఫుల్‌గా మద్యం తాగి పని ప్రదేశానికి వచ్చి భార్య లక్ష్మీతో నాగరాజు గొడ వపడ్డాడు. దీంతో తాగుడు మానేయాలని మం దలించింది. నాగరాజు మనస్థాపం చెంది ఇం ట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని చీరతో ఉరి వే సుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టానికి బాన్సువాడ ఏరియాస్పత్రికి తరలించా రు. అనంతరం కుటుంబీకులు అప్పజెప్పారు.