భారీ వర్షాలతో మెట్ట పంటలకు దెబ్బ

ABN , First Publish Date - 2020-08-22T10:36:10+05:30 IST

భారీ వర్షాలతో వరినాట్లు వేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా మెట్ట పంటలు వేసిన రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.

భారీ వర్షాలతో మెట్ట పంటలకు దెబ్బ

బోధన్‌, ఆగస్టు 21: భారీ వర్షాలతో వరినాట్లు వేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా మెట్ట పంటలు వేసిన రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.  వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మెట్ట పంటల్లో నీరు నిలిచి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మినుము, పెసర పంటలు వేసిన రైతులు ప్రస్తుత వర్షాలతో ఆందోళన చెందుతున్నారు. నీరు నిలిచి మినుము, పె సర పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయని రైతులు వాపోతున్నారు. మినుము, పెసర గింజలు పంట పొలాల్లోనే మొలకలు వస్తుండడంతో రైతులు తీవ్ర ఆందో ళన చెందుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల మెట్ట పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.


బోధన్‌ డివిజన్‌ పరిధిలోని రెంజల్‌, బోధ న్‌, కోటగిరి మండలాల్లో మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల రైతులు భూముల్లో మె ట్ట పంటలను సాగు చేశారు. మినుము, పెసరతోపాటు సోయాబీన్‌ పంటలను వేశారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పంట పొలాలలో నీరు నిలిచింది. ఇప్పటికే మినుము పెసర పంటలు గింజకట్టి కోత దశలో ఉండడంతో గింజలు నీట మునిగి మొలకలు వచ్చాయి. చేతికొచ్చిన పంట కళ్ల ఎదుటే వర్షాల కారణంగా నీట మునిగి మొలకలు వచ్చి తీవ్రంగా న ష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మినుము, పెసర పంట మొలక వచ్చి నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2020-08-22T10:36:10+05:30 IST