ఎస్సారెస్పీలోకి భారీగా చేరుతున్న వరదనీరు

ABN , First Publish Date - 2020-08-01T11:34:04+05:30 IST

శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా చే రుతోందని ప్రాజెక్టు ఈఈ రామారావు తెలిపారు

ఎస్సారెస్పీలోకి భారీగా చేరుతున్న వరదనీరు

మెండోర, జూలై 31: శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా చే రుతోందని ప్రాజెక్టు ఈఈ రామారావు తెలిపారు. ప్రాజెక్టు ఎగువ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు 19,283 క్యూసెక్కుల వరద వస్తోందని ఆయన పేర్కొనారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రానికి 1074.10 అడుగుల (39.006 టీఎంసీలు) నీటి నిల్వ ఉందన్నారు. గత ఏడాది ఇదే రోజున 1049.0 అడుగుల (5.660టీఎంసీ) నీటి నిల్వ ఉందన్నారు. జూన్‌ 1వ తే దీ నుంచి ప్రాజెక్టులోకి 17.58 టీఎంసీల నీరు వచ్చి చేరిందని ఈఈ తెలి పారు. ప్రాజెక్టు నుంచి కాకతీయ, సరస్వతీ, లక్ష్మీ కాలువలకు, గుత్ప, అలీ సాగర్‌ ఎత్తిపోతలకు నీటి విడుదల కొనసాగుతోందన్నారు.

Updated Date - 2020-08-01T11:34:04+05:30 IST