వైద్యం వికటించి పసికందు మృతి

ABN , First Publish Date - 2020-12-11T04:33:02+05:30 IST

వైద్యం వికటించి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల పసికందు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్‌ కేంద్రంలో చోటు చేసు కుంది.

వైద్యం వికటించి పసికందు మృతి
పసికందు మృతదేహం

బాన్సువాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటు చేసుకున్న సంఘటన 

శిశువు లోపంతో జన్మించడంతోనే మృతి చెందినట్లు వైద్యుల వెల్లడి

బాన్సువాడ, డిసెంబరు 10: వైద్యం వికటించి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల పసికందు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్‌ కేంద్రంలో చోటు చేసు కుంది. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలం జక్కల్‌ దాని తండాకు చెందిన శ్రీనివాస్‌, మీనా దంపతుల కు ఐదు రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో సుఖ ప్రసవంతో ఆడ శిశువు జన్మించింది. అయితే, బరు వు తక్కువగా ఉండటంతో బుధవారం రాత్రి బాన్సు వాడ పట్టణంలోని బిందుశ్రీ పిల్లల ఆస్పత్రికి చికిత్స ని మిత్తం తీసుకెళ్లారు. శిశువు లోపంతో ఉన్నారని, మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని రెండు రో జులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని వై ద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో బుధవారం రాత్రి శిశువుకు ఓ ఇంజక్షన్‌ ఇవ్వ డం వల్ల ఇన్‌ఫెక్షన్‌ అయి కాళ్లు, చేతులు పచ్చగా మచ్చలుగా ఏర్పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై వైద్యులు సంగ్రాం రాథోడ్‌ను వివరణ కోరగా, శిశువు లోపంతో జన్మించడం, బరువు తక్కువగా ఉండటంతోపాటు పచ్చ కామెర్లు శరీరం పసుపు రంగుగా మారడంతో  యాంటి బయాటిక్‌ ఇంజక్షన్‌ ఇచ్చామని ఆయన తెలిపారు. ఇంజక్షన్‌ ఇవ్వగానే తల్లి వద్ద పాలు తా గడం వల్ల ముక్కు, నోటి ద్వారా రావడంతో ఊపి రాడక మరణించారని వైద్యులు వివరించారు. దీం తో పసికందు కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్ప త్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసు కున్న బాన్సువాడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులు, బంధువులను సము దాయించి ఆస్పత్రి బయటకు పంపించారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా, ఎలాంటి కేసు నమోదు కాలేదని వివరించారు.

Updated Date - 2020-12-11T04:33:02+05:30 IST