గురుకుల పాఠశాలలో షెడ్యూల్‌ ఖరారు

ABN , First Publish Date - 2020-12-08T04:58:38+05:30 IST

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2020-21 సం వత్సరంలో 5వ తరగతి ప్రవేశానికి షెడ్యూల్‌ ప్రకటించినట్లు ఆ సంస్థ నిజామాబాద్‌ ప్రాంతీ సమన్వయాధికారిని అలివేలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గురుకుల పాఠశాలలో షెడ్యూల్‌ ఖరారు

డిచ్‌పల్లి, డిసెంబరు 7:  సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2020-21 సం వత్సరంలో 5వ తరగతి ప్రవేశానికి షెడ్యూల్‌ ప్రకటించినట్లు ఆ సంస్థ నిజామాబాద్‌ ప్రాంతీ సమన్వయాధికారిని అలివేలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2020 నవంబరు 1న నిర్వహించిన 5వ తరగతి ప్ర వేశ ఫలితాల్లో టీజీసెట్‌ 2020 ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలి పారు. ఎంపికైన విద్యార్థులకు ఆయా పాఠశాల హెచ్‌ఎంలు సమాచారం అందిస్తారని తెలిపారు. దరఖాస్తులో పేర్కొన్న సెల్‌ ఫోన్‌కు మెసెజ్‌ వస్తుందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఆయా పాఠశాలలో ఈ నెల 7 నుంచి 17 వరకు సమాచార పత్రంలో పేర్కొన్న విధంగా ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో రిపోర్టు చేసి ప్రవేశం పొందవచ్చునన్నారు. గడువులోపు రిపోర్టు చేయకపోతే రద్దు అవుతుందని తెలిపారు. మెరిట్‌లో తదుపరి విద్యార్థులకు రద్దయిన సీట్లు కేటాయిస్తామని తెలిపారు. విద్యార్థులు టీసీ, బోనాఫైడ్‌, తహసీల్దార్‌ జారీ చేసిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌, నాలుగు ఫొటోలు, ఫిజికల్‌ సర్టిఫికెట్‌తో ఈనెల 17లోపు సీటు పొందవచ్చునని సూచించారు. ఏమైనా సలహాలు ఉంటే పాఠశాల ప్రిన్సిప ల్‌ ఫోన్‌ ద్వారా సమాచారం తెలుసుకోవాలన్నారు. 


Updated Date - 2020-12-08T04:58:38+05:30 IST