గల్ఫ్ సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటుచేయాలి
ABN , First Publish Date - 2020-12-11T05:22:33+05:30 IST
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటుచేయాలని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు.

బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్
ఆర్మూర్ టౌన్, డిసెంబరు 10: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటుచేయాలని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు. స్థానికంగా గురువారం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 15లక్షల మంది గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్తున్నారని, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయమై గత ఉమ్మడి రాష్ట్రంలో గల్ఫ్ వలస కార్మికులు ఆందోళన చేపట్టారని, ఇప్పుడు స్వరాష్ట్రంలో కూడా వారు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 18న జిల్లా కేంద్రంలోని తిలక్ గార్డెన్ న్యూఅంబేద్కర్ భవన్‌లో జరుగనున్న గల్ఫ్ బోర్డు సాధన రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని గల్ఫ్ కార్మికులను కోరారు. ఈ సమావేశంలో గల్ఫ్ కార్మిక సంఘం ఆర్మూర్ డివిజన్ నాయకులు ఎం.లింగమయ్య, బి.నర్సయ్య, బి. శ్రీకాంత్, రవి, గంగాసాయిలు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.