రిజిస్ట్రేషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌.. నేటి నుంచి ప్రారంభించాలని సీఎం ఆదేశం

ABN , First Publish Date - 2020-12-11T04:54:29+05:30 IST

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు హై కోర్టు గురువారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో శుక్రవారం నుంచి రిజిస్ర్టేషన్ల ప్రక్రియను ప్రా రంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను ఆదేశించారు.

రిజిస్ట్రేషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌.. నేటి నుంచి ప్రారంభించాలని సీఎం ఆదేశం

వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి

నిజామాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు హై కోర్టు గురువారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో శుక్రవారం నుంచి రిజిస్ర్టేషన్ల ప్రక్రియను ప్రా రంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను ఆదేశించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మూ డు నెలలుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు నిలిపివేయడంతో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. కొనుగోలు చేసిన వారితో పాటు అమ్మేవారు కూడా ఇబ్బందులు ఎ దుర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎ దురుచూస్తున్నారు. భవన నిర్మాణాలు చే సిన వారితో పాటు కొత్తగా ప్లాట్‌లు కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్‌లు కాక స మస్యలు ఎదుర్కొన్నారు. బ్యాంకు రుణా లు రాక తిప్పలు పడుతున్నారు. అధికారులు మాత్రం రిజిస్ట్రేషన్‌ల కోసం అ న్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. ప్రభుత్వ ం నుంచి ఆదేశాలు వెలువడగానే రి జిస్ట్రేషన్‌లు చేసేందుకు సిద్ధంగా ఉ న్నారు. రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోవడం తో ప్రతినెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఆగిపోయింది. 

ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. నిజామాబాద్‌ అర్బ న్‌, రూరల్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌, కామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుందలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతినెలా రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. కొన్ని సమయాల్లో అంతకు మించి ఆదాయం ఉండేది. సగటున సబ్‌ రిజిస్ట్రార్‌ కా ర్యాలయంలో 20 నుంచి 50 వరకు డాక్యుమెంట్‌ల రి జిస్ట్రేషన్‌లు అయ్యేవి. నిజామాబాద్‌ నగరంతో పాటు కామారెడ్డిలో రియల్‌ వెంచర్‌లు ఎక్కువగా ఉండడం వల్ల ఈ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌లు ఎక్కువగా జరిగేవి. నిజామాబాద్‌ నగరం పరిధిలో రి యల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లు ఎక్కువగా ఉండడం, అపార్ట్‌మెంట్‌ల నిర్మాణం భారీగా జరగడం వల్ల ప్రతినెలా  రిజిస్ట్రేషన్‌లు ఎక్కువగా జరిగేవి. ఉమ్మడి జిల్లా పరిధిలో నిజామాబాద్‌లోనే రెండు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో ఆదాయం ఎక్కువగా వచ్చేది. కా మారెడ్డి జిల్లా కేంద్రం కావడం వల్ల అక్కడ కూడా రి జిస్ట్రేషన్‌లు పెరిగాయి. ప్రభుత్వం ధరణిని తీసుకరావడం వల్ల వ్యవసాయేతర ఆస్తులు కూడా వీటి కిం దనే రిజిస్ట్రేషన్‌లు చేసేందుకు నిర్ణయించారు. సెప్టెంబరు 8న రిజిస్ట్రేషన్‌లు నిలిపివేశారు. వ్యవసాయేతర ఆస్తులన్నీ కొత్త మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా ఆన్‌ లైన్‌లో నమోదు చేశారు. ప్రభుత్వం నేటి నుంచి స్లా ట్‌ బుకింగ్‌కు అవకాశం ఇవ్వడంతో ఇక రిజిస్ర్టేషన్లు ఊపందుకోనున్నాయి.

సబ్‌ రిజిస్ట్రార్‌లలో ఏర్పాట్లు పూర్తి

రిజిస్ట్రేషన్‌లు చేసేందుకు ఉమ్మడి జిల్లాలోని పది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేశారు. ధర ణి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదైన వ్యవసాయ భూ ములకు తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్లు చే సేందుకు గత నెలలో అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ ం వ్యవసాయేతర ఆస్తులకు మాత్రం అప్పుడు అను మతి ఇవ్వలేదు. అన్ని వివరాలను సబ్‌ రిజిస్ట్రార్‌ కా ర్యాలయాల్లో ఎంట్రీ చేసి ధరణికి అనుసంధానం చేసి ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు గురువారం అనుమతులు వచ్చాయి. అయితే, మూడు నెలలుగా రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోవడంతో కో ట్ల రూపాయల క్రయవిక్రయాలు ఆగిపోయాయి. ఎ క్కువ మంది కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్‌లు కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయేతర భూములు, భవనాల రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోవడంతో వ్యాపారం కూడా దెబ్బతిన్నది. రియల్‌ ఎస్టేట్‌లో పె ట్టుబడులు పెట్టిన వారు రిజిస్ట్రేషన్‌ లేక అమ్మకాలు తగ్గి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కరోనా లాక్‌డౌన్‌ తో భవన నిర్మాణ రంగంలో కొంత ఇబ్బందులు ఎదు రైనా ప్రస్తుతం పుంజుకునే సమయంలో రిజిస్ట్రేషన్‌ లు లేక సమస్యలు ఎదుర్కొన్నారు. అపార్ట్‌మెంట్‌లతో పాటు ప్లాట్లు, ఇతర వ్యవసాయ ఆస్తులను కొనుగో లు చేసిన వారు రిజిస్ట్రేషన్‌లు కాక సమస్యలు ఎదు ర్కొన్నారు. డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్‌లు కాకపోవడంతో రోజులు గడిచిన కొద్ది మళ్లీ సమస్యలు వస్తాయని భావించారు. కొంత మంది ప్లాట్లు కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్‌ కాకపోవడం వల్ల భవన నిర్మాణాలకు బ్యాంకు రుణాలు రాక ఇబ్బందులను ఎదుర్కొ న్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా  ప్రభుత్వం అన్నీ ధరణి ద్వారా చేసేందుకు రిజిస్ట్రేషన్‌ లు నిలిపివేసినా మూడు నెలల నుంచి లేకపోవడం వల్ల చాలా సమస్యలు తలెత్తాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లు చేసిన విధంగానే తమకు కూడా అవకాశం ఇవ్వాలని క్రయవిక్రయాల ద్వారా భూము లు కొనుగోలు చేసిన వారు కోరారు. సబ్‌ రిజిస్ట్రార్‌  కార్యాలయాలకు వచ్చి తిరిగి వెళ్లారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోవడం వల్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కూడా భారీగా ఇబ్బందులు ఎదు ర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోవడం వల్ల ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం పడిపోయింది. ఉ మ్మడి జిల్లా పరిధిలో ప్రతినెలా వచ్చే ఆదాయం కూ డా రిజిస్ట్రేషన్‌లు లేక తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ  సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్టాంపుల అమ్మకం, వి ల్‌ డీడ్‌ల రిజిస్ట్రేషన్‌లు మాత్రమే చేస్తున్నారు. వ్యవసాయేతర ఆస్తుల విలువల సంబంధించిన మార్ట్‌గే జ్‌ చేయడంతో పాటు ఈసీలను అందిస్తున్నారు. ప్ర భుత్వం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లకు అను మతులు ఇవ్వగానే స్టాట్‌లను బుక్‌ చేసుకునేందుకు ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు గురువారం రాష్ట్ర హైకోర్టు, ప్రభుత్వం అనుమతులు ఇవ్వ డంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2020-12-11T04:54:29+05:30 IST