ఘనంగా యోగా దినోత్సవం

ABN , First Publish Date - 2020-06-22T11:13:49+05:30 IST

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జి ల్లాలో ఘనంగా జరుపుకొన్నారు. కరోనా కారణంగా ఈసారి అధికారికంగా నిర్వహించకపోయినప్పటికీ

ఘనంగా యోగా దినోత్సవం

నిజామాబాద్‌ కల్చరల్‌, జూన్‌ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జి ల్లాలో ఘనంగా జరుపుకొన్నారు. కరోనా కారణంగా ఈసారి అధికారికంగా నిర్వహించకపోయినప్పటికీ వివిధ యోగా కేంద్రాల్లో జరిపారు. ఆదివారం కావడంతో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు యోగాసనాలు వే సేందుకు ఆసక్తి చూపారు. జిల్లా కేంద్రంలోని దయానంద యోగా రీసెర్చ్‌ సెంటర్‌లో యోగా రాంచందర్‌ శిక్షకులచే యోగాసపనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో రుక్మారావు, ప్రభాకర్‌, గురుపాదం, భూమాగౌడ్‌, నారాయణ, అశోక్‌, శ్రీనివాస్‌, తోట రాజశేఖర్‌, శ్రీనివాసచారి పాల్గొన్నారు. అలాగే, ఆరోగ్య రక్ష నేచర్‌ క్యూర్‌ యోగా అండ్‌ బ్యూటీ నిర్వాహకురాలు ఐశ్వర్య కాలే ఆధ్వ ర్యంలో బస్వాగార్డెన్‌లో యోగా దినోత్సవం నిర్వహించారు.

Updated Date - 2020-06-22T11:13:49+05:30 IST