ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలి

ABN , First Publish Date - 2020-12-31T04:52:46+05:30 IST

రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న రాష్ట్ర ప్ర భుత్వం యాసంగిలో సాగు చేసే అన్ని రకాల ధాన్యాలను ప్రభుత్వ కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేసి కచ్చితంగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సహకార సంఘం సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలి
మాట్లాడుతున్న డిచ్‌పల్లి విండో చైర్మన్‌ జైపాల్‌

డిచ్‌పల్లి, డిసెంబరు 30: రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న రాష్ట్ర ప్ర భుత్వం యాసంగిలో సాగు చేసే అన్ని రకాల ధాన్యాలను ప్రభుత్వ కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేసి కచ్చితంగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సహకార సంఘం సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. మంగళవారం ఖిల్లా డిచ్‌పల్లి సహకార సంఘ సమావేశం చైర్మన్‌ గజవాడ జైపాల్‌ అధ్య క్షతన జరిగింది.  కార్యక్రమంలో సర్పంచ్‌ గడ్డం రాధాకిష్ట రెడ్డి, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌ రావు, సహకార సంఘ ఉపాధ్యక్షుడు చిన్న గం గారాం, డైరెక్టర్లు బాలముల్ల, సాయిలు, రమేశ్‌, రాంచందర్‌, లత, రాజవ్వ, సాయమ్మ, హరిచంద్‌, సతీశ్‌ రెడ్డి, గంగారెడ్డి,శాంసన్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

‘సొసైటీ పాలక వర్గం సభ్యులను నిర్బందిస్తాం’

మోపాల్‌: గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం రద్దుచేస్తే సొసైటీ పాలకవర్గ సభ్యులను కార్యాలయాల్లో నిర్బంధిస్తామని రైతులు హెచ్చరించారు. బుఽధవారం మండలంలోని బోర్గాం (పి), బాడ్సి సొసైటీ కా ర్యాలయాల్లో సర్వసభ్య సమావేశాలను అధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బాడ్సి సొసైటీలో పలువురు రైతులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తానని చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్గాం (పి) సొసైటీలో రైతులు మాట్లాడుతూ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను రద్దుచేస్తే రైతు వ్యతిరేకత తీవ్రమవుతుందన్నారు. తీర్మానం కాపీలను కలెక్టర్‌, ఎమ్మెల్యే, సంబంధిత శాఖ మంత్రికి, ముఖ్యమంత్రికి, కేసీఆర్‌లకు ఫ్యాక్స్‌ చేశారు. సమావేశంలో సొసైటీల పాలకవర్గం సభ్యులు, ఐడీసీఎంఎస్‌ డైరెక్టర్‌ లింగన్న, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. 

వర్నిలో..

వర్ని: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యథాతథంగా కొనసాగించేలా చర్యలు చేపట్టాలని బుధవారం పాతవర్ని విండో పాలకవర్గం తీర్మానం చేసింది. అధ్యక్షుడు సాయిబాబా అధ్యక్షతన నిర్వహించిన మహాజన సభలో పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు నానిబాబు, పెరిక పద్మ, నాగభూషణం, గోపాల్‌, సంతోష్‌, సీఈవో గంగాధర్‌, సభ్యులు పాల్గొన్నారు. 

నల్లవెల్లి సొసైటీలో సర్వసభ్య సమావేశం

ఇందల్వాయి: మండలంలోని నల్లవెల్లి సొసైటీలో ఐడీసీఎంఎస్‌ ఛైర్మన్‌ సంబరి మోహన్‌ అధ్యక్షతన బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా సొసైటీ సీఈవో తేజాగౌడ్‌ ఆదాయ వ్యయాలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా మోహన్‌ మాట్లాడుతూ సొసైటీ పరిధిలో 2097 మంది రైతుల వద్ద నుంచి 90 వేల క్వింటాళ్లకు పైగా ధాన్యం కొనుగోలు చేశామని దీంతో సొసైటీకి రూ.51 లక్షలకు పైగా లాభం చేకూరిందని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ వైస్‌ చైర్మన్‌ రమేష్‌, స్థానిక సర్పంచ్‌ విజయ లక్ష్మారెడ్డి, వైస్‌ ఎంపీపీ అంజయ్య, డైరెక్టర్‌లు, రైతులు పాల్గొన్నారు. 

గోదాంల నిర్మాణం చేపట్టాలి

కోటగిరి: మండలంలోని ఎత్తొండ సహకార సంఘంలో 5వేల మెట్రిక్‌ ట న్నుల గోదాంలను నిర్మించాలని సభ్యులు తీర్మానించారు. సహకార సం ఘం మహాజన సభ విండో అధ్యక్షుడు అశోక్‌పటేల్‌ అధ్యక్షతన జరిగింది. రైస్‌మిల్‌ ఆవరణలో ప్రహరీ, గోదాం నిర్మించాలని తీర్మానించారు. కార్యక్రమంలో విండో కార్యదర్శి సంతోష్‌, సభ్యులు కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

గుండారంలో..

నిజామాబాద్‌ రూరల్‌: రైతులు పండించిన ధాన్యం విక్రయించేందుకు ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రద్దుచేస్తామన్న ప్రభుత్వ నిర్ణయం పునఃసమీక్షించుకోవాలని గుండారం సొసైటీ రైతులు తీర్మానం కోరారు. బుధవారం మహాజనసభను చైర్మన్‌ శ్రీధర్‌ అధ్యక్షతన నిర్వహించారు. పలు తీర్మానాలు చేశారు. సమావేశంలో డైరెక్టర్లు సత్యంరెడ్డి, గంగాధర్‌, అనిత, దశరథ్‌,ముత్తెమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T04:52:46+05:30 IST