రైతులను పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2020-12-04T04:26:53+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు అవకాశం ఇచ్చినా రైతులను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు.

రైతులను పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
మాట్లాడుతున్న మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి

మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 3: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు అవకాశం ఇచ్చినా రైతులను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. డీసీసీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. గడిచిన ఏడు సంవత్సరాల్లో రెం డు ప్రభుత్వాలు రైతులకు ఎలాంటి మేలు చేయలేదన్నా రు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించలేదన్నారు. రాష్ట్రంలో సన్నరకాలను పండించాలని చెప్పి ప్ర స్తుతం వారికి ధర కల్పించలేదన్నారు. సన్నరకాలు సాగుచేయడం వల్ల రైతులకు దిగుబడి తగ్గడతో పాటు నష్టాలు వచ్చాయన్నారు. ప్రభుత్వం ధర కల్పిస్తే రైతులకు మేలు క లుగుతున్నారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చ ట్టాలు రైతులకు మేలు చేయవన్నారు. ఈ చట్టాలు ప్రై వేట్‌ వ్యక్తులకే ఉపయోగపడుతాయన్నారు. దేశంలో 70 శాతం వరకు సన్న, చిన్నకారు రైతులే ఉన్నారన్నారు. ప్రై వేట్‌ వ్యాపారులు ధర నిర్ణయిస్తే రైతలు నష్టపోతారన్నారు. ఈ చట్టాన్ని రద్దుచేయాలని పంజాబ్‌, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌ రైతులు చలిని కూడా పట్టించుకోకుండా ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారని అన్నారు. వీరికి కాంగ్రెస్‌ పా ర్టీ అండగా ఉందని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలోనే రైతులకు మేలు జరిగిందన్నారు. సమావేశంలో డీసీసీ అధ్య క్షుడు మానాల మోహన్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గ డుగు గంగాధర్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొబ్బిలి రా మ కృష్ణ, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు ఇర్ఫాన్‌ అలీ, ఎన్‌ ఎస్‌యూఐ అధ్య క్షుడు వేణు, మహ్మద్‌ ఇసా, గడుగు రోహి త్‌, అబ్దుల్‌ ఎ జాజ్‌, నాగరాజు, విపుల్‌గౌడ్‌, మహేష్‌, రామ ర్తి గోపి, శ్రీనివాస్‌గౌడ్‌, అమృతాపూర్‌ గంగాధర్‌, చింటు  పాల్గొన్నారు.   

Updated Date - 2020-12-04T04:26:53+05:30 IST