ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2020-12-02T05:15:06+05:30 IST
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని నాయకులు అన్నారు. మంగళవారం వెంచిర్యాల్‌లో గొర్రెలు, మేకల కు ఉచిత నట్టల వ్యాధి నివారణ టీకాలను వేశారు.

ముప్కాల్, డిసెంబరు 1 : ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని నాయకులు అన్నారు. మంగళవారం వెంచిర్యాల్‌లో గొర్రెలు, మేకల కు ఉచిత నట్టల వ్యాధి నివారణ టీకాలను వేశారు. ఈ సందర్భంగా మం డల పశువైద్యాదికారి గౌతమ్‌రాజ్ మాట్లాడుతూ.. ఈనెల 7న ప్రతీ గ్రా మంలో శిబిరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ ఆకుల చిన్న రాజన్న, సర్పంచ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
భీమ్‌గల్ : నందిగల్లీలో మేకలు, గొర్రెలకు డాక్టర్ రవీందర్ నట్టల వ్యాధి నివారణ మందులను వేశారు. పట్టణంలోని 14 మంది గొల్లకుర్మ రైతులకు చెందిన 1242 గొర్రెలు, 210 మేకలకు మందును వేశామన్నారు.
కోటగిరి : ఎత్తొండలో గొర్రెలు, మేకలకు నట్టల వ్యాధి నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఏఎంసీ చైర్మన్ ప్రారంభించారు. గొర్రెలు, మేకలు పెంపకందారులు సబ్సిడీపై షెడ్‌ల కోసం దరఖాస్తులు చేసుకోవా లని మార్కెట్ కమిటీ చైర్మన్ గంగాధర్ సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సాయిబాబు, ఎంపీటీసీ కల్పన, ఫారూఖ్, పశువైద్యాధికారి సురేష్, పీఎస్‌పీసీఎస్ అధ్యక్షుడు జగదీశ్ పాల్గొన్నారు.
రుద్రూరు : అక్బర్‌నగర్ గ్రామంలో మంగళవారం నట్టల వ్యాధి నివా రణ టీకాలను వేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్, సర్పంచ్ గంగామణి, జడ్పీటీసీ నారోజి గంగారం పాల్గొన్నారు.
బోధన్‌రూరల్ : పెగడాపల్లి గ్రామంలో మందులను పశుసంవర్ధకశాఖ అధికారి నజీర్, డాక్టర్ బేగ్, సర్పంచ్ శంకర్ ఆధ్వర్యంలో వేశారు. రాష్ట్ర కార్యక్రమంలో వీడీసీ చైర్మన్, కుర్మ సంఘం అధ్యక్షుడు రవి పాల్గొన్నారు.
ఆర్మూర్‌రూరల్ : మంథని, పిప్రి గ్రామాల్లో గొర్రెలు, మేకలకు నట్టల వ్యాధి నివారణ మందులు వేశారు. జడ్పీటీసీ మెట్టు సంతోష్, సర్పంచ్ కొత్తింటి లింబారెడ్డి, ఉపసర్పంచ్ అసపురం శ్రీనివాస్‌రెడ్డి, మండల పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ లక్కం ప్రభాకర్ పాల్గొన్నారు.
భీమ్‌గల్ రూరల్ : మండలంలోని కుప్కల్ గ్రామంలో మంగళవారం గొర్రెలు, మేకలకు నట్టల వ్యాధి నివారణ మందులు వేశారు. కార్యక్రమం లో పశువైద్యాధికారి రవీందర్, సిబ్బంది సంతోష్, నరేష్ పాల్గొన్నారు.
జక్రాన్‌పల్లి : మునిపల్లి, నల్లగుట్టతండా, లక్ష్మాపూర్ గ్రామాల్లో సర్పం చ్‌లు ఎం.చిన్నసాయిరెడ్డి, కైలాస్‌నాయక్, మోహన్‌నాయక్ గొర్రెలకు, మేక లకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో పశువైద్యాధికారిణి శిరీష, పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కమ్మర్‌పల్లి : బషీరాబాద్‌లో గ్రామ సర్పంచ్ సక్కరం అశోక్ గొర్రెలు, మేకలకు నట్టల వ్యాధి నివారణ మందులను వేశారు. మండల పశువైద్యా ధికారి డాక్టర్ భావ్య, ఉప సర్పంచ్ విక్రమ్, ఎంపీటీసీ తోట జ్యోతి, వెటర్నరి అసిస్టెంట్ ప్రవీణ్ రెడ్డి, స్వప్న, బైకన్ మహేష్ పాలొన్నారు.
సిరికొండ: మేకలకు, గొర్రెలకు నట్టల వ్యాధి నివారణ మందును వే యించుకోవాలని సర్పంచ్ గద్దల గంగాదాస్ తెలిపారు. పెద్దవాల్గోల్‌లో మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీటీసీ బొబ్బిలి గం గవ్వ, మండల పశువైద్యాధికారి డాక్టర్ బాబురావు పాల్గొన్నారు.
ధర్పల్లి : యాదవులకు త్వరలోనే గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు ఎంపీపీ సారికారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. మండలంలోని 50 శాతం యా దవులకు గొర్రెల పంపిణీ పూర్తయిందని, మరో 50 శాతం పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సుజావుద్దీన్, సుభాష్ పాల్గొన్నారు.