ప్రజా సమస్యలు పరిష్కరించడంలో సర్కారు విఫలం

ABN , First Publish Date - 2020-12-01T05:37:00+05:30 IST

హైదరాబాద్‌లో వర్షాలకు కాలనీలు కాలువలుగా బస్తీలు బురదలుగా మారడంతో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెంజర్ల సురేష్‌ అన్నారు.

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో సర్కారు విఫలం
మాట్లాడుతున్న రెంజర్ల సురేష్‌

పెద్దబజార్‌, నవంబరు 30: హైదరాబాద్‌లో వర్షాలకు కాలనీలు కాలువలుగా బస్తీలు బురదలుగా మారడంతో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెంజర్ల సురేష్‌ అన్నారు. సోమవారం నగరంలోని  ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ను కూల్చివేత గురించి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ మాట్లాడడం సరికాదని అన్నారు. ఘాట్‌ను ప్రభుత్వ మే నిర్మించిందని, ఈ విషయం తెలిసే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నగర ప్రజల జీవనప్రమాణాలు పెంచకపోవడం, డబుల్‌ బెడ్‌రూం వంటి ఇళ్లు అభివృద్ధి సంక్షేమాలను గాలికి వదిలేయడం జరిగిందన్నారు. నూతనంగా విద్యుత్‌ బిల్లులను తీసుకవచ్చింది కేంద్రప్రభుత్వమేనని అన్నారు. చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయం, వి ద్యుత్‌పై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, జిల్లా అధికార ప్రతినిధి కొత్త రాజు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T05:37:00+05:30 IST