వ్యవసాయ కూలీలకు భలే డిమాండ్‌

ABN , First Publish Date - 2020-12-28T05:19:18+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వరినాట్లు ఊపం దుకోవడంతో వ్యవసాయ కూలీలకు డిమాండ్‌ పెరిగింది. నిజాంసాగర్‌లో పుష్కలంగా నీరు ఉండడం, అలీసాగర్‌ గుత్ప ఎత్తిపోతల ద్వారా నీటి విడు దల జరుగుతుండడం, శ్రీరాంసాగర్‌ జలకళతో ఉట్టిపడుతుండడంతో యా సంగి పంటలు ఊపందుకున్నాయి.

వ్యవసాయ కూలీలకు భలే డిమాండ్‌

రోజు వారీ గుత్తకు ఆసక్తి చూపుతున్న కూలీలు 

ఎకరానికి మూడు నుంచి నాలుగు వేల వరకు గుత్తా

బోధన్‌, డిసెంబరు 27: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వరినాట్లు ఊపం దుకోవడంతో వ్యవసాయ కూలీలకు డిమాండ్‌ పెరిగింది. నిజాంసాగర్‌లో పుష్కలంగా నీరు ఉండడం, అలీసాగర్‌ గుత్ప ఎత్తిపోతల ద్వారా నీటి విడు దల జరుగుతుండడం, శ్రీరాంసాగర్‌ జలకళతో ఉట్టిపడుతుండడంతో యా సంగి పంటలు ఊపందుకున్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధి లో ప్రాజెక్టులతోపాటు చెరువులు, కుంటలు పూర్తిగా నీటితో నిండి ఉండడం తో రెండో పంటకు రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల పరిధిలో వరినాట్లు ఊపందుకున్నాయి. బోధన్‌ డివిజన్‌ ప రిధిలోని వర్ని, మోస్రా, చందూరు, రుద్రూరు, కోటగిరి, బోధన్‌, ఎడపల్లి, రెంజల్‌, నవీపేట మండలాలలో వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. బాన్సు వాడ డివిజన్‌ పరిధిలోని బీర్కూర్‌, నసురుల్లాబాద్‌, బాన్సువాడ మండలా లలో వరినాట్లు కొనసాగుతున్నాయి. వరినాట్లతో కూలీలకు డిమాండ్‌ ఏర్ప డింది. గతంలో కూలీ పనులకు రోజువారి కూలీకి వచ్చేవారు. అయితే ఇప్పు డు వ్యవసాయ పనుల్లో ట్రెండ్‌ మారింది. వ్యవసాయ కూలీలు రోజు వారి కూలీకి రాకుండా గుత్త పనులు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతం లో వరినాట్లు వేసేందుకు కూలీలు రోజువారీ కూలీగా వచ్చేవారు. ఆడ, మ గ కూలీల వ్యత్యాసం ఉండేది. అయితే ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థి తులు ఏర్పడ్డాయి. ఆడ, మగ అంటూ తేడా లేకుండా వరినాట్లకు గుత్తగా పనులు చేసేందుకు కూలీలు ఆసక్తి చూపుతున్నారు. రోజువారి కూలీ అంటే వరినాట్లు వేసేందుకు నిరాశక్తత ప్రదర్శిస్తున్నారు. ఒక్కో ఎకరాకు వరినాట్లు వేసేందుకు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. 20 మంది కూలీలు ఉంటే ప్రతీరోజు 4 ఎకరాల పైనే వరినాట్లు వేస్తున్నారు. అంటే 20 మంది కూలీలు సుమారు 15వేల రూపాయల వరకు రోజు వారి గుత్తా రూపంలో కూలి పొందుతున్నారు. అంటే ఒక్కోకూలీకి రోజువారి 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూలీ గిట్టుబాటు అవుతోంది. గుత్త పనులతో వరినాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 

ఉదయం 6గంటలకే వరి చేలల్లో కూలీలు

గుత్త పనులకు ఆసక్తి చూపుతున్న కూలీలు వరినాట్లు వేసేందుకు ఉద యం 6గంటలకే పంట పొలాల్లో కనిపిస్తున్నారు. ప్రతీరోజు ఉదయం 5 గం టలకు స్వగ్రామాల నుంచి బయలు దేరుతున్న కూలీలు 6గంటల లోపు వరినాట్లలో నిమగ్నమవుతున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 6 గంటల వర కు వరినాట్లు వేస్తున్నారు. వ్యవసాయ కూలీలు ఇంటికి చేరుకునే వరకు రా త్రి 8గంటలు అవుతుంది. తెల్లవారుజామునే 5గంటల నుంచి రాత్రి 8 గంట ల వరకు దాదాపు గుత్త పనుల్లో కూలీలు నిమగ్నమవుతున్నారు. 12గంటల కూలీ పనుల్లో నిమగ్నమై రోజువారి రెట్టింపుకూలీను పొందగలుగుతున్నా రు. దూర ప్రాంతాలకు వరినాట్లు వేసేందుకు వెళ్తున్న కూలీలు గుత్త డబ్బు లతోపాటు వాహనపు చార్జీలను సైతం రోజు వారి వెయ్యి నుంచి రెండువేల రూపాయల వరకు పొలం యజమానుల నుంచి వసూలు చేస్తున్నారు. 

ఏ రోజుకు ఆ రోజే కూలీ డబ్బు

గుత్త పనులకు వెళ్తున్న వ్యవసాయ కూలీలు రోజువారి డబ్బులను వ సూలు చేసుకుంటున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ ప నులకు వెళ్లే కూలీలు వారం రోజుల పాటు పనులు చేసి గ్రామంలో సంత రోజు పొలం యజమాని నుంచి కూలీ డబ్బులు పొందేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రోజువారి కూలీ వచ్చేందుకు కూలీలు ఇష్టపడకపో వడంతో గుత్త పనులకు వెళ్తున్న కూలీలు సాయంత్రానికి పొలం యజమా నుల నుంచి డబ్బులు వసూలు చేసి అక్కడే పొలం వద్ద గుత్త డబ్బులను పంపకాలు చేసుకుంటున్నారు. ఏ రోజుకు ఆ రోజే కూలీ డబ్బులు వ్యవసా య కూలీలకు అందుతున్నాయి. కాలంతోపాటు వ్యవసాయ కూలీలు కూడా మార్పు చెందారని ఈ పరిణామాలను బట్టి చెప్పవచ్చు. 

Updated Date - 2020-12-28T05:19:18+05:30 IST