ఘనంగా దత్త జయంతి.. వేదమంత్రోచ్ఛరణతో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2020-12-31T04:57:50+05:30 IST

త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడి జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని సంత్‌ ఆచార్య మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఘనంగా దత్త జయంతి.. వేదమంత్రోచ్ఛరణతో ప్రత్యేక పూజలు

నిజామాబాద్‌  కల్చరల్‌, డిసెంబరు 30: త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడి జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని సంత్‌ ఆచార్య మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిర్టిసాయికృపానగర్‌లో గల సద్గురు ధామం, ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు సాగాయి. మధుసూదనానంద స్వామిజీ ఆధ్వర్యంలో ఘనంగా గోపూజ, యజ్ఞ క్రతువు సాగాయి. స్వామిజీ దత్తాత్రేయుడి జీవిత చరిత్రను భక్తులకు వివరించారు. పిట్ల కృష్ణ మహరాజ్‌, ఆలయ వ్యవస్థాపకులు ఇప్పకాయల హరిదాసు భక్తులకు సంతాన ఫలాలను అందజేశారు. చిన్నాపూర్‌లో గల దత్త ఆశ్రమంలో జరిగిన జయంతి వేడుకల్లో పండితులు ప్రమోద్‌ కులకర్ణి స్వామికి వేదమంత్రోచ్ఛరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఆలయాల్లో పూజలు

మోపాల్‌: పౌర్ణమి సందర్భంగా మోపాల్‌ మహాలక్ష్మి మందిరంలో య జ్ఞం, నిర్వహించారు. గ్రామస్థులకు అన్నదానం ఏర్పాటు చేశారు. మండలంలోని నర్సింగ్‌పల్లి గ్రామంలో ఉన్న ఇందూరు తిరుమల తిరుపతి వేం కటేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే బోర్గాం (పి) గ్రామంలో ఉన్న సుబ్రహ్మణ్యస్వామి, లక్ష్మీగణపతి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివెళ్లి పూజలు చేశారు. 

Updated Date - 2020-12-31T04:57:50+05:30 IST