యువతికి సడన్ గా ఫిట్స్.. ప్రియుడు ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే ఘోరం..!

ABN , First Publish Date - 2020-06-16T17:03:16+05:30 IST

కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలం బరంగ్‌ఎడ్గి గ్రామానికి చెందిన లక్కపల్లి కవిత (21) సోమవారం బీర్కూర్‌ శివారులోని దత్తాత్రేయ మందిరం వద్ద అనుమానస్పదంగా మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరంగ్‌ఎడ్గి గ్రామానికి చెందిన

యువతికి సడన్ గా ఫిట్స్.. ప్రియుడు ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే ఘోరం..!

అనుమానాస్పదంగా యువతి మృతి


బీర్కూర్‌(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలం బరంగ్‌ఎడ్గి గ్రామానికి చెందిన లక్కపల్లి కవిత (21) సోమవారం బీర్కూర్‌ శివారులోని దత్తాత్రేయ మందిరం వద్ద అనుమానస్పదంగా మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరంగ్‌ఎడ్గి గ్రామానికి చెందిన కవిత గత కొన్ని రోజులుగా బాన్సువాడలోని తన అక్క ఇంటి వద్ద ఉంటూ, పిట్లంలో ఏఎన్‌ ఎంగా పని చేస్తోంది. బాన్సువాడకు చెందిన శివకుమార్‌ పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరు ప్రేమించుకున్నట్లు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. సర్టిఫికెట్ల కోసం వస్తున్నానని, తన తల్లి చంద్రభాగతో ఫోన్‌లో మాట్లాడగా.. తాను ఇంటి వద్ద లేనని, సాయంత్రం రావాలని కూతురు కవితకు సూచించింది. సర్టిఫికెట్ల కోసం శివకుమార్‌తో కలిసి కవిత బరంగ్‌ఎడ్గిలోని తనతల్లి దగ్గరకు ద్విచక్రవాహనంపై బయలుదేరింది. 


ఇరువురు మొదట బీర్కూర్‌ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానానికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీకి కూత వేటు దూరంలో ఉన్న దత్తాత్రేయ స్వామి మందిరానికి వెళ్లారు. దత్తాత్రేయుడిని దర్శించుకునేందుకు మెట్లు ఎక్కుతుండగా కవిత కడుపు నొప్పితో ఫిట్స్‌ వచ్చి అపస్మారక స్థితికి చేరుకుంది. శివకుమార్‌ కవితను ఎత్తుకుని కిందకు తీసుకుని వస్తుండగా, కవిత అప్పటికే ప్రాణాలను వదిలింది. ఈ సమాచారం కవిత తల్లిదండ్రులకు తెలుపడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాన్సువాడ రూరల్‌ సీఐ టాటాబాబు, బీర్కూర్‌ ఎస్సై సతీష్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియాస్పత్రికి తరలించా రు. కవిత తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టాటాబాబు తెలిపారు.

Updated Date - 2020-06-16T17:03:16+05:30 IST