విధుల నుంచి తప్పుకుంటున్నారు!

ABN , First Publish Date - 2020-04-05T11:07:34+05:30 IST

కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రితోపాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి రెండు ఏరి యా ఆసుపత్రులు

విధుల నుంచి తప్పుకుంటున్నారు!

ప్రభుత్వ వైద్యులు, సిబ్బందిపై కరోనా ప్రభావం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ అవుతున్న ఓపీ

ప్రైవేట్‌ ఆసుపత్రులు బంద్‌ ఉండటం మరో కారణం

తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ప్రభుత్వ వైద్యులు

కరోనా డ్యూటీ వేస్తారెమోనని కొందరు  వైద్యుల్లో భయం

దీనికి తోడు వైద్యులపై రాజకీయ ఒత్తిడిలు

రాజీనామాలు చేసి వెళ్లిపోతున్న కొందరు వైద్యులు

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఆరుగురు వైద్యులు.. ఎల్లారెడ్డిలో ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌ రాజీనామా


కామారెడ్డి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రితోపాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి రెండు ఏరి యా ఆసుపత్రులు ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆ సుపత్రిల్లో 37 మంది వైద్యుల్లో 27 మంది రెగ్యూలర్‌ కా గా మిగతా 10 మంది కాంట్రాక్ట్‌ పద్ధతిపై పని చేస్తు న్నారు. స్టాప్‌ నర్సులు 20 మంది, పారా మెడికల్‌ సిబ్బం ది 7 గురు, సపోర్టింగ్‌ స్టాప్‌ నర్సులు 10, సానిటేషన్‌ సిబ్బంది 40 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 104 మంది వైద్యసిబ్బంది రోగు లకు వైద్య సేవలు అందిస్తున్నారు. బాన్సు వాడ ఏరియా ఆసుపత్రిలో 101 మంది వైద్యులు, సిబ్బంది ఉండగా 27 మంది వైద్యులు ఉన్నారు. 17 మంది స్టాప్‌ నర్సులు, 5 గురు పారామెడికల్‌ సిబ్బంది, 10 మంది సపోర్టింగ్‌ నర్సు లు, 30 మంది సానిటేషన్‌ సిబ్బంది పని చేస్తున్నారు. ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రిల్లో 33 మంది వైద్యులు, సిబ్బ ంది ఉండగా ఏడుగురు వైద్యులు, ఆరుగు రు స్టాప్‌ నర్సు లు, ముగ్గురు పారామెడికల్‌ సిబ్బంది, నలుగురు సపో ర్టింగ్‌ నర్సులు, 13మంది సానిటేషన్‌ సిబ్బంది పని చేస్తు న్నారు. వీటితోపాటు జిల్లాలో 23 పీహెచ్‌సీలు, ఆరు సీహె చ్‌సీలు ఉన్నాయి.


వైద్యుల్లో కరోనా భయం..

జిల్లాలోని ప్రభుత్వ, ప్రవేట్‌ వైద్యుల్లో కరోనా భయం నెలకొంది. కరోనా వైరస్‌ విస్తరించుకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత నెల 22వ తేది నుంచి లాక్‌డౌన్‌ను ప్రక టించాయి. దీంతో జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బా న్సు వాడ పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లోనూ ప్రయివేట్‌ ఆసుపత్రులు సైతం మూసేసారు. దీంతో చిన్నపాటి వ్యాఽ దులతో సమస్యలు ఎదుర్కుంటున్న రోగులు, ఎమర్జెన్సీ కేసులు ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారంతా ప్రభు త్వ ఆసుపత్రులకే క్యూ కడుతున్నారు. దీంతో 13 రోజులు గా ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఓపీ రోగుల సంఖ్య పెరుగు తోంది. ఓ వైపు వైద్య ఆరోగ్య శాఖలోని కొందరు వైద్యు లను, సిబ్బంది కరోనా వైరస్‌పై సేవలు అం దిస్తున్నారు. దాదాపు జిల్లాలోని వైద్యులందరిని కరోనా వైరస్‌ పైనే వి ధులు నిర్వహించేందుకు డ్యూటీలు వేస్తున్నారు. కొందరు వైద్యులు ఆసుపత్రిల్లో ఉండి ఓపీ చూసుకునేలా ప్రణా ళికలు రూపొదించారు. కానీ నిత్యం ఓపీ రోగుల సంఖ్య పెరగడంతో వైద్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా యి. దీంతో ఒత్తిడి నెలకొంటోంది. దీంతో ఏమి చేయలేక విధులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుం దని కొందరు వైద్యులు వాపోతున్నారు. ప్రయివేట్‌ ఆసు పత్రి యాజమాన్యాలు తెరిచి ఉంచితే ఓపీ రోగులు వైద్య పరీక్షలు చేసుకునే అవకాశం ఉంది. కానీ ప్రయివేట్‌ ఆసు పత్రి యాజమాన్యం ప్రస్తుత పరిస్థితుల్లో తెరచి ఉంచడం మంచిది కాదని మూసి ఉంచారు. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్‌ ఆసుపత్రులను తె రిపించి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కొరుతున్నారు.


విధులకు రాజీనామా చేస్తున్నారు..

జిల్లాలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగు తుండడం, అనుమానిత లక్ష ణాలు ఉన్నవారి కారైంటన్‌కు తరలిస్తున్నారు. జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ ప్రభు త్వ ఆసుపత్రిల్లో 32 బెడ్‌లతో ఐసోలేషన్‌ కేంద్రా లను ఏర్పాటు చేయగా వీటి పరిధిలోనే 120 బెడ్‌లతో మూడు కారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐసోలేషన్‌ కేంద్రాలకు ఒక వైద్యుడితోపాటు స్టాప్‌ నర్సు లను, సానిటైజన్‌ సిబ్బందిని ప్రస్తుతం షిప్ట్‌ల వారీగా డ్యూటీలు వేస్తున్నారు. మరికొందరు వై ద్యులు ఆయా ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఓపీ చూస్తుం టారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు నమోదవుతుం డటంతో వీరికి సైతం ఎక్కడ కరోనా విధులు వేస్తారోనని భయాందోళనకు గుర వుతున్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇద్దరు కాంట్రాక్ట్‌ పిజిషియన్‌ వైద్యులు, మరో ఇద్దరు థర్మా నాలాజిస్ట్‌ వైద్యులు, ఒక మత్తు వైద్యు డు, మరో పిల్లల వైద్యుడు ఇలా ఆరుగురు కాంట్రాక్ట్‌ వై ద్యులు పని ఒత్తిడి భరించలేక, కరోనా డ్యూటీ ఎక్కడ వే స్తారోనని భయంతో రాజీనామా చేసి విధులకు హాజరు కావడం లేదని సమాచారం. అదేవిధంగా ఎల్లారెడ్డి ఏరి యా ఆసుపత్రిల్లోనూ ఓ ల్యాబ్‌ టెక్నిషియన్‌ పని ఒత్తిడి భారం వల్ల విధులకు రాజీనామా చేసినట్లు సమాచారం. ఇలా కొందరు వైద్యులు కరోనా భయంతో విధుల నుంచి తప్పుకుంటున్నారనే భావన వైద్య ఆరో గ్యశాఖలో వినిపిస్తోంది. ఇలాంటి విప త్కర పరిస్థితుల్లో వైద్యులు రాజీ నామా చేయడం  ప్రస్తుత ం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది.


వైద్యులపై రాజకీయ  ఒత్తిళ్లు! 

కరోనా  విజృంభణ నేప థ్యంలో జిల్లాలోని ప్ర భుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులపై, సిబ్బందిపై రాజకీయ ఒ త్తిడిలు వస్తున్నట్లు విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కరోనా  లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలంటూ పూర్తి బాధ్యత వైద్య ఆరోగ్యశాఖ, వైద్యులపై సిబ్బందిపై ఉంచింది. సర్వేకు వెళ్తున్న వైదుల్యపై సిబ్బందికి స్థానిక ప్రజల నుంచి సహకారం అందడం లేదు. ఇటీవల కాలంలో ఢిల్లీ నిజామోద్దీన్‌ ప్రార్థనలకు వె ళ్లి జిల్లాకు వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉండడం వారితో కా ంటాక్ట్‌ ఉన్న వారికి కరోనా వైరస్‌ సోకడం, రిపోర్ట్‌ల్లోనూ నిర్ధార ణ అయింది.  బాన్సువాడ పట్టణంలోని ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. బాన్సువాడలో ఏ ప్రాంతంలోనైతే కేసులు నమోదు అయ్యాయో అక్కడ స్థానిక ప్రజలకు ఇబ్బందులు పెట్టవద్దని స్థానిక రాజకీయ నేతలు వైద్యులపై, సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ప్రజలు సహకరి స్తేనే వైద్య పరీక్షలు చేయాలని వైద్యులకు హుకుం జారీ చేస్తున్నట్లు సమాచారం. వైద్యులకు అండగా ఉండాల్సిన రాజకీయ నేతలు ఒత్తిడి తెవడంపై విమర్శలకు దారి తీస్తోంది. ఉన్నతాధికారుల నుంచి కూడా సహకారం అందడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

Updated Date - 2020-04-05T11:07:34+05:30 IST