గురుకుల ఉపాధ్యాయుల పోటీ పరీక్షకు ఉచిత శిక్షణ

ABN , First Publish Date - 2020-02-12T11:33:37+05:30 IST

గురుకుల ఉపాధ్యాయ పోటీ పరీక్షకు సిద్ధమయ్యే నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన బీసీ, ఎ స్సీ, ఎస్టీలకు చెందిన

గురుకుల ఉపాధ్యాయుల పోటీ పరీక్షకు ఉచిత శిక్షణ

నిజామాబాద్‌ అర్బన్‌, ఫిబ్రవరి 11: గురుకుల ఉపాధ్యాయ పోటీ పరీక్షకు సిద్ధమయ్యే నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన బీసీ, ఎ స్సీ, ఎస్టీలకు చెందిన నిరుద్యోగులకు 60 రోజులపాటు ఉచిత శిక్షణ ఇస్తు న్నామని, అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ వెంకన్న పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు  స్టడిసర్కిల్‌.సీజీజీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఈనెల 15లోగా దరఖాస్తు లు చేసుకోవాలన్నారు. పట్టణ అభ్యర్థులు రెండు లక్షలు, గ్రామీణ అభ్యర్థు లు లక్షా 50వేల సంవత్సర ఆదాయం ఉండాలన్నారు. బీసీలకు 75 శాతం, ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 5శాతం, అనాథలకు, ఈబీసీలకు 5శాతం కే టాయించామన్నారు. ఎస్సెస్సీ, డిగ్రీ, బీఈడీ కుల రధవీకరణ పత్రాలతో పా టు ఆధాయ ధ్రువీకరణ పత్రం దరఖాస్తుతో జత చేయాలన్నారు. ఇతర వివరాలకు 08462-241055 నెంబర్‌ను సంప్రదించాలని, జిల్లా కేంద్రంలో నిని బీసీ స్టడి సర్కిల్‌లో నేరుగా సంప్రదించవచ్చన్నారు.


 మెస్‌ మేనేజర్‌ పోస్టు భర్తీకి ఇంటర్వ్యూలు..

నిజామాబాద్‌ నగరంలోని నాగారంలో గల గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న మెస్‌ మేనేజర్‌ పోస్టుకు ఈనెల 17న మధ్యాహ్నం 3.00 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళా శాల ప్రిన్సిపాల్‌ సింధు తెలిపారు. బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఎం.ఎస్సీ ఫుడ్‌ టెక్నాలజీ న్యూట్రిషన్‌, బీఎస్సీ ఫుడ్‌ టెక్నాలజీ అర్హతలు గల జిల్లా స్థానిక అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, బయోడేటాతో ఇంటర్వ్యూ కు హాజరుకావాలన్నారు. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. 

Updated Date - 2020-02-12T11:33:37+05:30 IST