మార్చి వరకు ఉచిత బియ్యం పంపిణీ

ABN , First Publish Date - 2020-11-27T04:26:58+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్య ం పంపిణీని మార్చి వరకు పొడిగించింది. కేంద్రం నిర్ణయం తో తెల్లరేషన్‌ కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది.

మార్చి వరకు ఉచిత బియ్యం పంపిణీ
రేషన్‌ షాపు

ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. పేదలకు ఊరట
ఆర్మూర్‌, నవంబరు 26: కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్య ం పంపిణీని మార్చి వరకు పొడిగించింది. కేంద్రం నిర్ణయం తో తెల్లరేషన్‌ కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. కరోనా వై రస్‌ కట్టడిలో భాగంగా మార్చిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. లాక్‌డౌన్‌ సమయంలో పేదప్రజల ను ఆదుకోవడానికి మూడు నెలలు ఉచిత బియ్యంతో పా టు నగదు అందజేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తెల్లకార్డుదారుల కు అందించే ఒక రూపాయికి కిలో బియ్యాన్ని ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం సైతం దేశ వ్యాప్తంగా ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటిం చింది. అప్పటి నుంచి ప్రతీ కార్డుదారునికి ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున రేషన్‌దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఒక్కో వ్యక్తికి 12కిలోల చొప్పున ఇచ్చారు. ఒక కార్డు మీద నలుగురు పేర్లు ఉంటే 48కిలోల బియ్యం జూలై వర కు అందాయి. ఆగస్టు నుంచి 10కిలోల చొప్పున అందించా రు. ముందుగా నవంబరు వరకే అని ప్రకటించడంతో డి సెంబరు నుంచి వస్తుందో లేదోనని ప్రజలు ఆందోళన చెం దారు. అధికారులు సైతం డీలర్లను డీడీలు కట్టాలని సూ చించారు. ఉచితంగా పంపిణీ చేసిన సమయంలో రేషన్‌ డీలర్లు డీడీలు కట్టాల్సిన అవసరం లేదు. ఉచితంగా ఇవ్వ కుంటే డీలర్లు డీడీలు కట్టాల్సి ఉండేది. డీలర్లు డీడీలు కట్ట డానికి ఈనెల 26వ తేదీ గడువుగా అధికారులు నిర్ణయిం చారు. కానీ, కేంద్రం మరో నాలుగు నెలలు పొడిగించింది.
పేదల బియ్యం.. దళారుల భోజ్యం
లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి దొరకనందున పేద ప్రజలు పస్తులుండవద్దనే ఉద్దేశంతో ఉచితంగా బియ్యం అందజేస్తుంటే.. కొందరు ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తు న్నారు. ఉచిత బియ్యం పేదప్రజలకు ఎంత ఆదుకుంటుం దో, కొందరి వల్ల దుర్వినియోగం కూడా జరుగుతోంది. ఆహా ర భద్రత కార్డులు పొందిన వారు చాలా మంది అనర్హులు న్నారు. వీరికి రేషన్‌ బియ్యం అవసరం లేదు. పిల్లలు ఫీజు లు, ఆరోగ్యశ్రీకార్డు తదితర ప్రయోజనాల కోసం తెల్లరేషన్‌ కార్డు తీసుకున్నారు. మరికొంత మంది రేషన్‌ బియ్యం దొ డ్డుగా ఉంటాయనే ఉద్దేశంతో తినడానికి ఇష్టపడరు. ఇలాం టి వారందరు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. రేషన్‌ బి య్యం అవసరం లేనివారు డీలర్‌ వద్ద డబ్బులు తెచ్చుకుం టున్నారు. ఒక కార్డు మీద నలుగురి పేర్లు ఉంటే 40కిలోలు వస్తాయి. ఇలాంటి వారు కిలోకు రూ.10చొప్పున రూ.400 డీలర్‌ వద్ద తీసుకుంటున్నారు. మరికొందరు బియ్యం తీసు కుని అక్రమార్కులకు కిలోకు రూ.12నుంచి రూ.14కు విక్ర యిస్తున్నారు. ఇలా రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నా యి. దళారులు ఈ బియ్యాన్ని రైస్‌మిల్లులకు, మహారాష్ట్రకు తరలిస్తున్నారు. దళారులు కిలోకు రూ.18నుంచి రూ.20వర కు విక్రయిస్తున్నారు. ఇటీవలకాలంలో రేషన్‌ బియ్యం చా లా చోట్ల పట్టుబడ్డాయి. ఎక్కువ బియ్యం ఉచితంగా రావ డం వల్ల విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అధికా రులు గట్టి నిఘా ఏర్పాటు చేసి రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

Updated Date - 2020-11-27T04:26:58+05:30 IST