గల్ఫ్‌కు పంపుతానని ఏజెంట్‌ మోసం..!

ABN , First Publish Date - 2020-07-06T20:43:32+05:30 IST

గల్ఫ్‌కు పంపిస్తానని ఓ ఏజెంట్‌ ముగ్గురి వద్ద డబ్బులు తీసుకొని పత్తా లేకుండా పోయిన ఘటన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలోని బోదన్‌,

గల్ఫ్‌కు పంపుతానని ఏజెంట్‌ మోసం..!

బోధన్‌ (నిజామాబాద్) : గల్ఫ్‌కు పంపిస్తానని ఓ ఏజెంట్‌ ముగ్గురి వద్ద డబ్బులు తీసుకొని పత్తా లేకుండా పోయిన ఘటన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలోని బోదన్‌, బాన్సువాడ డివిజన్‌లకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఏడాదిన్నర క్రితం గల్ఫ్‌కు వెళ్లేందుకు సిద్ధమై అతిక్‌ఖాన్‌ అనే ఏజెంట్‌కు డబ్బులు అ ప్పచెప్పి ఏడాదిన్నర కాలంగా ఆ ఏజెంట్‌ కోసం అన్వేషిస్తున్నారు. మాయమాటలు చెప్పిన ఏజెంట్‌ ఇప్పుడు పత్తాలేకుండా పోయాడు. కోటగిరి మండలం రాయకూర్‌ గ్రామానికి చెందిన పి. లక్ష్మణ్‌, బిచ్కుంద మండలం బండరెంజల్‌ గ్రామానికి చెందిన శంబుసాయిలు, బాన్సువాడ మండలం సోమేశ్వరంకు చెందిన బింగి సాయిలు గల్ఫ్‌కు వెళ్లేందుకు ఓ మధ్యవర్తి ద్వారా ఏజెంట్‌ ను ఆశ్రయించారు. బోధన్‌కు చెందిన సదరు ఏ జెంట్‌ నిజామాబాద్‌ జిల్లా కేంద్రంగా తన అడ్డా ను ఏర్పాటు చేసుకొని గల్ఫ్‌కు వెళ్లే వారి వద్ద నుంచి లోలోపల లక్షలాది రూపాయలు వసూలు చేయడంతోపాటు పాస్‌పోర్టులను సైతం తీసు కున్నాడు. 


మధ్యవర్తిని నమ్మిన ఈ ముగ్గురు వ్య క్తులు ఏజెంట్‌కు సుమారు లక్ష రూపాయల వరకు నగదు ఇవ్వడంతోపాటు పాస్‌పోర్టులనూ అప్పగించారు. ఏజెంట్‌ 26-07-2019న ఈ ము గ్గురికి హైదారాబాద్‌లో మెడికల్‌ టెస్టులను పూర్తి చేయించి ఏడాదికాలంగా పత్తా లేకుండా పోయాడు. సదరు ఏజెంట్‌ ఫోన్‌ను స్విచ్‌ఆఫ్‌ చేయడంతోపాటు అడ్డాలను సైతం మార్చివేశాడు. ఈ ముగ్గురిలో లక్ష్మణ్‌ అనే వ్యక్తి ఏజెంట్‌ వెంట పడి తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో లక్ష్మణ్‌ పాస్‌ పోర్టును అప్పగించి డబ్బులు ఇవ్వకుండా చేతులు దులుపుకున్నాడు. మిగతా ఇద్దరు పాస్‌పోర్టు లు సైతం అతని వద్దే ఉన్నాయి. సదరు ఏజెంట్‌కు సంబంధించిన సమీప బంధువు బోధన్‌లో ఉండడం.. ఈ వ్యవహరంలో తనదే భరోసా అంటూ పలుమార్లు చెప్పి ఇప్పుడు తనకు సంబంధం లేదని మాట్లాడుతున్నాడని బాధితులు వాపోతున్నారు. 


సదరు ఏజెంట్‌ ఫోన్‌ నెంబరు స్విచ్‌ ఆఫ్‌లో ఉండడం బోధన్‌, నిజామాబాద్‌లలో ఆయన అడ్డాలకు వెళ్లినా అవి తాళాలు వేసి ఉంటున్నాయని బాధితులు బోరుమంటున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకొని తమ కు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నా రు. గల్ఫ్‌కు వెళ్లి కుటుంబానికి బాసట అవుదా మని అప్పులు చేసి ఏజెంట్‌కు సుమారు లక్ష రూపాయల వరకు అప్పజెప్పామని, తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నా రు. కనీసం తమ పాస్‌పోర్టులు ఎక్కడ ఉన్నా యో తెలియని దుస్థితి ఏర్పడిందని కన్నీటి ప ర్యంతమవుతున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికా రులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని మధ్య వర్తితో పాటు ఏజెంట్‌ సమీప బంధువును విచా రిస్తే ఏజెంట్‌ ఆచూకీ దొరకడంతోపాటు తమకు న్యాయం జరుగుతుందని బాధితులు అభిప్రాయ పడుతున్నారు.


Updated Date - 2020-07-06T20:43:32+05:30 IST