జిల్లాలో మరో నలుగురికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-07-10T11:25:50+05:30 IST

కామారెడ్డి జిల్లాలో గురువారం మరో నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్ల్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్‌ తెలిపారు.

జిల్లాలో మరో నలుగురికి కరోనా పాజిటివ్‌

కామారెడ్డి టౌన్‌, జూలై 9: కామారెడ్డి జిల్లాలో గురువారం మరో నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్ల్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. కామారెడ్డి పట్టణంలో 2, భిక్కనూర్‌లో 1, గాంధారీలో 1 కేసు నమోదయిందని తెలిపారు. అంతేకాకుండా కామారెడ్డి పట్టణానికి చెందిన వృదు ్ధరాలు గత నెల రోజుల కిందట దగ్గు, దమ్ము, శ్వాసకోశ సమస్యలతో హైదరాబా ద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆ ఆసుపత్రి వైద్యులు వృద్ధు రాలికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


వృద్ధురాలితో పాటు కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా మరో నలుగురికి కరోనా సోకినట్లు తేలింది. అయితే మిగతా వారు ఆరోగ్యపరిస్థితి బాగానే ఉండడంతో కరోనా నుంచి కోలుకున్నారన్నారు. వృద్ధురాలు మాత్రం కరోనాపై పోరాడుతూ చివరకు గురువా రం మృతి చెందినట్లు ఆ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారని తెలిపారు.  నమోద యినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. జిల్లాలో వీటితో కలుపుకొని మొత్తం 105 కేసులు నమోదు కాగా ఒక కరోనా మరణం చోటు చేసుకుందని తెలిపారు. కాగా కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ వైద్యుడికి గత నెలలోనే పాజిటివ్‌గా నిర్ధారణ అయిన అది గురువారం పోర్టల్‌లో పొందుపరిచినట్లు సమాచారం.

Updated Date - 2020-07-10T11:25:50+05:30 IST