జూనియర్‌ ఇంటర్‌లో నలుగురు డిబార్‌

ABN , First Publish Date - 2020-03-15T11:53:49+05:30 IST

జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షల్లో శనివారం జిల్లా వ్యాప్తంగా

జూనియర్‌ ఇంటర్‌లో నలుగురు డిబార్‌

నిజామాబాద్‌ అర్బన్‌, మార్చి 14: జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షల్లో శనివారం జిల్లా వ్యాప్తంగా నలుగురు విద్యార్థులు డిబార్‌ అయ్యారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌  పరీక్షలకు మొత్తం 21,544 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 20,534 మంది హాజరు కాగా 1,010 మంది గైర్హాజరయ్యారు. నిజామాబాద్‌లోని విశ్వశాంతి కళాశాలలో ముగ్గురు, బోధన్‌ విజయ సాయి కళాశాలలో ఒక విద్యార్థి మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతుండగా అధికారులు పట్టు కొని డిబార్‌ చేశారు. నాలుగు పరీక్ష కేంద్రాలను డీఐఈవో ఒడ్డెన్న తనిఖీ చేశారు. డీఈసీ కమిటి, హెచ్‌పీసీ  కమిటీ 7పరీక్ష కేంద్రాలను, ఫ్లయింగ్‌ సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 13 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. 

Updated Date - 2020-03-15T11:53:49+05:30 IST