మరో నాలుగు పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-04-14T12:34:18+05:30 IST

జిల్లాలో సోమవారం మరో మూడు కరోనా పాజిటి వ్‌ కేసులు నమోదయ్యాయి.

మరో నాలుగు పాజిటివ్‌

జిల్లాలో పెరుగుతున్న కరోనా తీవ్రత

మరో నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ

జిల్లాలో మొత్తం 53కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

రెడ్‌ జోన్‌లలో నో మూమెంట్‌ ప్రకటన

మరో పది రోజులు ఇళ్లు వదిలి బయటకు రావద్దన్న కలెక్టర్‌


నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో సోమవారం మరో మూడు కరోనా పాజిటి వ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులసంఖ్య 53కి చేరింది. జిల్లా నుంచి ఢిల్లీ లోని మర్కజ్‌కు వెళ్లివచ్చిన 63 మందితో పాటు ప్రైమ రీ, సెకండరీ కాంటాక్ట్స్‌కు సంబంధించిన మొత్తం 452 మంది నమూనాలను జిల్లా అధికారులు పరీక్షల నిమి త్తం హైదరాబాద్‌కు పంపించారు. అందులో ఇప్పటి వ రకు 439 నమూనాల పరీక్షలు పూర్తయ్యాయి. వాటిలో 53 పాజిటివ్‌ రాగా, 386 నెగెటివ్‌ వచ్చాయి. సోమవా రం మూడు పాజిటివ్‌ రాగా 100 నెగెటివ్‌ వచ్చాయి. ఇంకా 13 నమూనాల రిపోర్టులు రావాల్సి ఉంది.


పాజి టివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు లాక్‌డౌన్‌ను వంద శాతం అమలు చేస్తున్నారు. ప్రజల ను మరో పది రోజుల పాటు ఇళ్లకే పరిమితం చేసేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని కంటైన్‌మెంట్‌ ప్రాంతాలను నో మూమెంట్‌ జోన్‌లుగా ప్రకటించారు. ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులను అధికారులే డోర్‌ డెలివరీ చేస్తున్నారు. అవసరమున్న చోట మొబైల్‌ వ్యాన్‌లను పెట్టి నిత్యావసర వస్తువుల ను సరఫరా చేస్తున్నారు. నగరంతో పాటు బోధన్‌, ఆర్మూర్‌, రెంజల్‌, మోస్రా, నందిపేట, మాక్లూర్‌, భీమ్‌ గల్‌, బాల్కొండలో ప్రజలు బయటకు రాకుండా చూ స్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో నిత్యావసర వస్తు వుల సరఫరా సమయాన్ని కూడా తగ్గించారు. నిజా మాబాద్‌ నగరంతో పాటు బోధన్‌లో ఉదయం 6 గం టల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఆర్మూర్‌ లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు షాపులను తెరిచి ఉంచుతున్నారు. రెడ్‌ జోన్‌లలోకి ఎవరినీ అను మతించడం లేదు.


జిల్లా వ్యాప్తంగా మరో పది రోజులు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక మైన చర్యలు చేపడుతున్నారు. అవసరం లేకున్నా ఎవ రైనా బయటకు వస్తే పోలీసులు కేసులు పెడుతున్నా రు. పీహెచ్‌సీలు, కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల పరిధిలో వైద్యు లు, పారామెడికల్‌ సిబ్బందిని, అంబులెన్సులను 24 గంటలు అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లా కేం ద్రం లోని జనరల్‌ ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డుతో పాటు క్వారంటైన్‌లో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు.  ఎమర్జెన్సీ కేసులను మాత్రమే చూస్తున్నారు.


మరో పది రోజులు బయటకు రావద్దు : కలెక్టర్‌

జిల్లాలో కరోనా తీవ్రత పెరుగుతోందని, ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని, లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లొచ్చినవారితో పాటు ప్రైమరీ కాంటాక్ట్స్‌ వల్ల కేసుల సంఖ్య పెరిగిందన్నారు. రానున్న పది రోజులు మరింత కీలకమని ఆయన అ న్నారు. ప్రజలు వంద శాతం లాక్‌డౌన్‌ను పాటించాల న్నారు. పది రోజుల తర్వాతనే జిల్లా సేఫ్‌ జోన్‌గా ఉం దా? లేదా? తెలుస్తుందన్నారు. చిన్నచిన్న అవసరాలకు పిల్లలు బయటకు రావద్దని కోరారు. అత్యవసరమైతే తప్పా పిల్లలను పంప వద్దని జిల్లా ప్రజలకు పిలుపుని చ్చారు.


కరోనా విస్తృతిని తగ్గించేందుకు పోలీసు, రెవె న్యూ, వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖలతో పాటు ఇతర శాఖల అధికారులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారన్నా రు. కరోనా తీవ్రతను తగ్గించేందుకు అందరూ సహక రించాలని ఆయన కోరారు. ఆదివారం చికెన్‌, మటన్‌ మార్కెట్‌ల వద్ద గుమిగూడి భౌతిక దూరం పాటించలే దన్నారు. ఒకవారం కొన్నింటిని వదులు కోవాలన్నారు అందరూ దగ్గరగా ఉంటే కరోనా వ్యాప్తి చెందడంతో పాటు బయటకు వెళ్లిన వారి ద్వారా కుటుంబసభ్యుల కూ వ్యాపిస్తుందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కేసు లు నమోదు చేస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు.

Updated Date - 2020-04-14T12:34:18+05:30 IST