సాగుసంబరం.. కామారెడ్డి జిల్లాలో జోరుగా పంటల సాగు

ABN , First Publish Date - 2020-08-12T17:34:43+05:30 IST

జిల్లాలో పంటలసాగు జోరుగా సాగుతోంది. ఈ వానాకాలం సీజన్‌లో నిర్ధేశించిన లక్ష్యానికి చేరువలో పంటల సాగవుతున్నాయి. సీజన్‌ మొదటి నుంచి వర్షాలు విస్తారంగానే కురుస్తుండట ంతో రైతులు జోరుగా పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో సాధారణం కంటే

సాగుసంబరం.. కామారెడ్డి జిల్లాలో జోరుగా పంటల సాగు

ఇప్పటి వరకు 4.41 లక్షల ఎకరాలలో సాగైన పంటలు

ఇందులో 1.85 లక్షల ఎకరాలకు పైగా సాగవుతున్న వరి

వరినాట్లు 2 లక్షల ఎకరాలు దాటుతాయంటున్న అధికారులు

ఇక విస్తారంగా ఆరుతడి పంటల సాగు

జిల్లాలో సాధారణం కంటే ఎక్కువే నమోదయిన వర్షపాతం 

ఇప్పటి వరకు 553.3 మి.మీ కురిసిన వర్షం

జలకళను సంతరించుకుంటున్న చెరువులు, కుంటలు


కామారెడ్డి (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంటలసాగు జోరుగా సాగుతోంది. ఈ వానాకాలం సీజన్‌లో నిర్ధేశించిన లక్ష్యానికి చేరువలో పంటల సాగవుతున్నాయి. సీజన్‌ మొదటి నుంచి వర్షాలు విస్తారంగానే కురుస్తుండట ంతో రైతులు జోరుగా పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 553.3 మి.మీ వర్షం కురువడంతో రైతులు పంటలను విస్తారంగా సాగు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. చెరువులు, కుంటలలోకి వరద వచ్చి చేరుతోం ది. జిల్లాలో ఇప్పటి వరకు 4.41లక్షల ఎకరాలలో వివిధ పంటలు సాగయ్యా యి. ఇందులో అత్యధికంగా రైతులు వరి పంటను సాగు చేశారు. ఇప్పటి వరకు వరి 1.85 లక్షల ఎకరాలలో సాగైంది. 2 లక్షల వరకు వరి పంట సాగ య్యే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయధికారులు పేర్కొంటున్నారు.


జిల్లాలో సాధారణం కంటే పెరిగిన సాగు

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు సాధారణ పంటల సాగుకంటే అద నంగా పంట సాగు పెరిగింది. జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో 4,85,304 ఎకరాలలో వివిధ పంటలు సాగు అవుతాయని అంచనా వేశారు. ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడంతో సాధారణం కంటే సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,41,783 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో  సోయాబీన్‌ పంట 1,01,920 ఎకరాల్లో పంటలు సాగు అవ్వాల్సి ఉండగా 77,510 ఎకరాల్లో సాగు అయ్యాయి. పత్తి 86,865 ఎకరాల్లో సాగు అవ్వాల్సి ఉండగా 55,120 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న 50,945 ఎకరాల్లో సాగు చేశారు. వరి 2,12,846 ఎకరాల్లో సాగు అవ్వాల్సి ఉండగా 1,85,301 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఇలా జిల్లాలో సాధారణం కంటే సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పవచ్చు.


1.85 లక్షల ఎకరాలలో వరి సాగు

జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు జోరందుకున్నాయి. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2,12,846 ఎకరాల్లో వరి పంట సాగు అవుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు అంచనావేయగా ఇప్పటి వరకు 1,85,301 ఎకరాలలో వరి సాగైంది. ఈ సీజన్‌లో మొదట్లో వర్షాలు అంతంతమాత్రంగా నే కురువడంతో రైతులు వరి వేసేందుకు ఆసక్తి చూపలేదు.  జూలై రెండో వారం నుంచి వర్షాలు కురవడంతో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధం అయ్యారు. మాచారెడ్డి, రామారెడ్డి, లింగంపేట్‌, గాంధారి, తాడ్వాయి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్‌, బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, బిచ్కుంద, కామారెడ్డి మండలాల్లో ప్రతిఏటా వరి పంటను విస్తారంగా సాగు చేస్తుంటారు. ఈ ఖరీ ఫ్‌ సీజన్‌లోనూ వర్షాలు కురవడంతో వరి నాట్లు జోరు అందుకున్నాయి. లింగంపేట్‌, నాగిరెడ్డిపేట్‌, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బీర్కూర్‌, నస్రు ల్లాబాద్‌ మండలాల్లో వరి పంటను రైతులు విస్తారంగా సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు 1,85,301 ఎకరాల్లో వరి నాట్లు పడ్డా యి. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్‌, లింగంపేట్‌ మండలాల్లో వరి మరింత సాగయ్యే అవకాశం ఉందని దీంతో 2లక్ష ఎకరాలకు పైగానే సాగు అయ్యే అంచనాలు ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటు న్నారు.


జోరుగా ఆరుతడి పంటల సాగు

ఆరుతడి పంటల సాగుకు కామారెడ్డి జిల్లా పెట్టిన పేరు. జిల్లాలో వర్షాధార పంటలైనా మొక్కజొన్న, సోయా, పత్తి, పెసర, మినము, కందులు లాంటి పంటలను రైతులు విస్తారంగా ప్రతీయేట సాగు చేస్తుంటారు. వానాకాలం సీజన్‌లో ఈ పంటలను భారీగానే సాగు అవుతుం టాయి. అడపాదడప కురిసిన వర్షాలకే ఈ పంటలు విస్తారంగా సాగు అవుతాయి. ఈ సీజన్‌ మొదటి నుంచే జిల్లాలో భారీగానే ఆరుతడి పంటలను సాగు చేశారు. ఈ సీజన్‌ లో జిల్లాలో అత్యధికంగా సోయా పంట సాగు అవుతోంది. ఇప్ప టి వరకు 77,510 ఎకరాల్లో సోయా పంటను రైతులు సాగు చేస్తున్నారు. అదేవిధంగా మొక్కజొన్న 50,945 ఎకరాల్లో, పత్తి 55,120 ఎకరాల్లో, కందులు 36,006, పెసర్లు 14,406, మినములు 20,285 ఎకరాల్లో ఈ పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటికే ఈ పంటలు రెండు పర్యాయాలుగా కలుపు తీయడం జరిగి ంది. కీటకాల బారిన పడకుండా స్ర్పేతో పాటు పురుగుల మందు పిచికారీ చేస్తున్నారు. జిల్లా లో ఇలా విస్తారంగా పంటలు సాగు అవుతుండటంతో రైతుల్లోనూ ఆశ లు రేకిత్తిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు పడితే వానా కాలం సీజన్‌ పంటలు గట్టెక్కే పరిస్థితి ఉంటుందని రైతులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.


జలాశయాలకు చేరని నీరు

జిల్లా వ్యాప్తంగా ఇటీవల విస్తారంగా వర్షాలు కురి సినప్పటికీ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్ట్‌ల్లోకి వరద నీరు రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పోచారం ప్రాజెక్ట్‌తో పాటు నిజాంసాగర్‌, కౌలాస్‌నాలా ప్రాజెక్ట్‌ల, కళ్యాణి, సింగీతం రిజ ర్వాయర్‌లకు వరద లేక వెలవెల బోతున్నాయి. రాష్ట్ర మంతటా అన్ని జలాశయాలు నీటితో కళకళలాడుతుండగా జిల్లాలోని జలా శయాలకు వరుదనీరు వచ్చి చేరడం లేదు. నిజాంసాగర్‌ ప్రాజె క్ట్‌ కింద కామారెడ్డి జిల్లాతో పాటు నిజామాబాద్‌ జిల్లాలోని లక్షల ఎకరాల్లో పంటలను సాగు చేస్తుంటారు. కానీ ప్రస్తుత ం ఈ ప్రాజెక్ట్‌లో ఆ స్థాయిలో నీరు లేకపోయి ంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆయా మండలాల్లోని చెరువులు, కుంట లలోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది.

Updated Date - 2020-08-12T17:34:43+05:30 IST