15 వరకు రైతు కల్లాలు పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-12-02T04:29:28+05:30 IST
ప్రభుత్వం మంజూరు చేసిన రైతు కల్లాలను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో కమలాకర్ రావు సూచించారు.

వేల్పూర్, డిసెంబరు1: ప్రభుత్వం మంజూరు చేసిన రైతు కల్లాలను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో కమలాకర్ రావు సూచించారు. మంగళవారం కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అక్లూర్, మోతె, పడిగెల గ్రామాల్లో సర్పంచ్ లు జైడి చిన్నవ్వ నాగాధర్‌రెడ్డి, రజిత చంద్రమోహన్‌గౌడ్, ద్యావతి వర్షిణి రాజ్‌కుమార్ అధ్యక్షతన గ్రామసభలు నిర్వ హించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రై తు కల్లాలు నిర్మించుకోని వారి స్థానంలో కొత్తవారు నిర్మిం చుకునే అవకాశం ఉందన్నారు. పశువుల కొట్టాలు, నీటి తొట్టిలు నిర్మించుకునే వారు డిసెంబరు 15లోగా పూర్తి చే సుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో పూడి కతీత, మురికికాలువల తొలగింపు గుర్తించారు. వ్యవసాయ సాగులో ఎరువుల వాడకం, నూతన యంత్రీకరణ పద్ధతు ల గురించి అవగాహన కల్పించారు. హరితహారంలో నాటి న మొక్కలకు నష్టం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏవో స్నేహశ్రీ, ఏపీవో, ఆయా గ్రామాల కార్యదర్శులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్‌లు, వార్డుసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ పనుల పరిశీలన
వేల్పూర్ తహసీల్ కార్యాలయంలో ప్ర భుత్వ ఆదేశాల మేరకు కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్న భూముల రిజిస్ట్రేష న్ పనులను మంగళవారం మండల ప్ర త్యేక అధికారి శ్రీనివాస్ పర్యవేక్షించారు. మండల గ్రామాల్లోని రైతులకు సంబంధిం చిన భూముల అమ్మకాలు, కొనుగోలు ఇ ప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయినవి, గిఫ్ట్ డీడీ, సెల్‌డీడీలకు సంబంధించిన ఫైళ్లను అధికారులు ఆయన పరిశీలించారు. ఈ రో జు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుకు రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు పాస్‌బుక్‌లు ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రైతుకు అందజేశారు. కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ రాజశేఖర్, గిర్దావర్ వేణు, సిబ్బంది ఉన్నారు.