పదోన్నతులు, బదిలీల సాధనకు పోరాటం
ABN , First Publish Date - 2020-12-13T05:36:01+05:30 IST
ఉపాధ్యాయులు గత ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదిలీల కోసం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రమణ అన్నారు.

టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రమణ
బాన్సువాడ టౌన్, డిసెంబరు 12: ఉపాధ్యాయులు గత ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, బదిలీల కోసం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రమణ అన్నారు. బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘ భవనంలో శనివారం ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, సాధారణ, అంతర్ జిల్లా బదిలీలు, మోడల్ పాఠశాల టీచర్ల బదిలీలు తక్షణమే చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోరుతూ ఉపాధ్యాయ సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 17న కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహారదీక్ష చేపట్టనున్నామన్నా రు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో దీక్షలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అనిల్, అసోసియేట్ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.