ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి
ABN , First Publish Date - 2020-12-16T05:03:39+05:30 IST
రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టిమ రల్చాలని కామారెడ్డి అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్‌పాటిల్ అన్నారు.
తాడ్వాయి, డిసెంబరు 15: రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టిమ రల్చాలని కామారెడ్డి అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్‌పాటిల్ అన్నారు. మంగళవారం తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామంలో రైతుపాటిమీది సాయిరెడ్డి జామతోట, అల్లనేరేడు, సీతాపాలల తోటలను ఆయన పరిశీలిం చారు. పండ్ల తోటలు పెంచి అధిక లాభాలు ఆర్జించాలన్నారు. మామిడి జా మ, దానిమ్మ, అల్లనేరేడు వంటి తోటలు పెంచి మంచి లాభాలు ఆర్జిం చాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్ సరోజన సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.