నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా

ABN , First Publish Date - 2020-05-08T08:38:43+05:30 IST

నిబంధలను ఉల్లంఘిస్తే జరిమాన విధిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ హెచ్చరించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో

నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా

కామారెడ్డిటౌన్‌, మే 7: నిబంధలను ఉల్లంఘిస్తే జరిమాన విధిస్తామని  మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ హెచ్చరించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో గురువారం వస్త్ర,వ్యాపారసముదాయలు సరి-బేసి విధానంలో ప్రారం భమయ్యాయి. కొందరు వ్యాపారులకు అవగాహన లేకపోవడంతో సరిసంఖ్య కేటాయించిన వ్యాపారసముదాయలను తెరవడంతో మున్సిపల్‌ సిబ్బంది హె చ్చరించి జరిమానా విధించారు.


రోజు విడిచి రోజు తెరుచుకోవాలని సూచించారు. మరికొన్ని చోట్ల కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో జరిమానా విధించారు. గురువారం కేటగీ రీ-బీలో 1967 దుకాణాలను గుర్తించగా అందులో 785 దుకాణాలు తెరిచి వ్యాపారాలు కొనసాగించారని మున్సిపల్‌ కమిషనర్‌ శైలాజ తెలిపారు. నిబం ధనలు ఉల్లంఘించి మాస్క్‌లు ధరించని వారికి రూ.6700ల జరిమానా విధించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ జానయ్య, సీనీయర్‌ అసి స్టెంట్‌ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-08T08:38:43+05:30 IST