ఎమ్మెల్సీకి నామినేషన్ల దాఖలు

ABN , First Publish Date - 2020-03-19T11:31:10+05:30 IST

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ స్థాని క సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా

ఎమ్మెల్సీకి నామినేషన్ల దాఖలు

నిజామాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ తరఫున నా మినేషన్‌ దాఖలు చేశారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఉమ్మ డి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఆమె రెండు సెట్ల నామి నేషన్లు వేశారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయించడంతో నేరు గా హైదరాబాద్‌ నుంచి వచ్చి ఈ నామినేసన్‌లను దాఖలు చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పలువురు నే తల పేర్లు వినబడినా చివరకు సీఎం కవిత వైపే మొ గ్గుచూపడంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిదులు, నేతలు నామినేసన్‌కు తరలివచ్చారు.


నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఉపఎన్నిక నోటిఫికేషన్‌ ఈ నెల 12న విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని నేతలు బుధవారం ఉదయం స్పీకర్‌ను కలిసి చర్చిం చి.. అక్కడి నుంచే నేరుగా జిల్లాకు చేరుకొని రిటర్నిం గ్‌ అధికారి సి.నారాయణరెడ్డికి అందించారు. నామినే షన్‌ వేసే సమయంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే లు బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, హన్మం త్‌షిండే, విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు బిగాల గణే ష్‌గుప్త, షకీల్‌, నల్లమడుగు సురేందర్‌ పాల్గొన్నారు. ఎంపీ కవిత అధికారికంగా నామినేషన్‌ వేసినా.. ఆ పార్టీకి చెందిన మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్‌రావు మరో సెట్‌ నామినేషన్‌ను బుధవారం వేశారు. మంగళవా రం ఆయన స్వయంగా వచ్చి నామినేషన్‌లు వేయగా బుధవారం ఆయన అనుచరుల ద్వారా వేయించారు.


అధికార పార్టీకి చెందిన ఆయన నామినేషన్‌ వేయ డం చర్చనీయాంశమైంది. కానీ ఆయన విత్‌డ్రా చేసు కునే  అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరఫున పోతన్‌కర్‌ లక్ష్మినారాయణ నామినేషన్‌లను వేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మినర్సయ్య, మాజీ జి ల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, బద్దం లింగారెడ్డితోపా టు ఇతర నేతలతో కలిసి వచ్చి నామినేషన్‌లను వేశా రు. ఎన్నికల ఉప ఎన్నిక నామినేషన్‌కు సమయం ద గ్గర పడుతుండడంతో బీజేపీ నేతలు ఈ నామినేషన్‌ లను వేశారు. కాంగ్రెస్‌ తరఫున నేడు వేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు ఇప్పటి వర కు నామినేషన్‌లు వేశారు. ఇంకా ఒక్క రోజే సమ యం మిగిలి ఉంది.


ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల నిర్ణయం మేరకే కవిత ఎంపిక: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ఉమ్మడి జిల్లకు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల సమిష్టి నిర్ణయం మేరకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుం ట్ల కవితను సీఎం కేసీఆర్‌ ప్రకటించారని మంత్రి  ప్ర శాంత్‌రెడ్డి తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం ఆమెను భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు.  ఉమ్మడి జిల్లా నేతల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి జి ల్లా పరిఽధిలో 824 ఓట్లు ఉన్నాయన్నారు. వీటిలో అ ధికార పార్టీకి 532 ఓట్లు ఉన్నాయని, మెజారిటీ అధి కార పార్టీకే ఉండడంతో ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత సునాయసంగా గెలుస్తారని ఆయన తెలిపారు.


నామినేషన్‌కు ముందు..స్పీకర్‌ ఇంట్లో సమావేశం

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ నామినేషన్‌ వేసే ముందు బుధవారం స్పీకర్‌ పోచారం ఇంట్లో ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు సమావేశమయ్యారు. నామినే షన్‌తోపాటు ఇతర అంశాలపైన చర్చించారు. మినిస్ట ర్స్‌ క్వార్టర్స్‌లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అ భ్యర్థి కల్వకుంట్ల కవిత మంత్రి ప్రశాంత్‌రెడ్డి, విప్‌ గం ప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, హన్మంత్‌ షిండే, బిగాల గణేష్‌గుప్త, షకీల్‌ అమీర్‌, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, నల్లమడుగు సురేందర్‌లతోపాటు డీసీసీబీ బ్యాంక్‌ ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎ మ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పోలింగ్‌ జరిగితే తీసుకోవా ల్సిన వ్యూహాలపైన వారు చర్చించడంతోపాటు నియో జకవర్గాల వారీగా ఓటర్లు, ఇతర అంశాలపై ఓ నిర్ణ యానికి వచ్చినట్లు తెలుస్తోంది. 


పోటీకే మొగ్గు..

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్‌, బీజేపీలు పోటీకే మొగ్గు చూపుతున్నాయి. టీఆర్‌ఎస్‌ నేతలు ఏకగ్రీవంపై దృష్టి పెట్టినా బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు మాత్రం పోటీలో ఉం డేందుకు సిద్ధమవుతున్నారు. ఏకగ్రీవం కాకుండా ఉం డేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి మా చారెడ్డి ఎంపీపీ నామినేషన్‌ వేసిన ఆయన ఉప సం హరించుకునే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్‌, బీజే పీ అభ్యర్థులు బరిలో ఉంటే పోటీ జరిగే అవకాశం ఉంది. ఎన్నికలు అనుకున్న రీతిలోనే కొనసాగనున్నా యి. ప్రతిపక్ష పార్టీలు బరిలో ఉంటే టీఆర్‌ఎస్‌ ఎంపీ టీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను అవస రమైతే క్యాంపులకు తరలించేందుకు ఏర్పాట్లను చేసు కుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా తమ ఓటర్లను దూరం కాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 


ఎన్నికలకు అధికారుల ఏర్పాట్లు

అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యా రు. పోటీ తప్పనిసరి అయ్యే పరిస్థితి ఉండడంతో ముందస్తు ఏర్పాట్లను చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరి ధిలో ఆరు పోలింగ్‌ కేంద్రాలను రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం పోలింగ్‌ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. బ్యాలెట్‌  బాక్సుల ను సిద్ధం చేస్తున్నారు. నేడు నామినేషన్‌ల ఘట్టం ముగుస్తుంది. ఈ నెల 20న నామినేషన్‌లను పరిశీల న, ఈ నెల 23వరకు నామినేషన్‌ల విత్‌డ్రా అనంత రం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు.    , 

Updated Date - 2020-03-19T11:31:10+05:30 IST