పొలం విషయంలో ఇరువర్గాల దాడి
ABN , First Publish Date - 2020-12-10T06:25:57+05:30 IST
మండలంలోని లింగాపూర్‌లో మంగళవారం రాత్రి పొలం విషయంలో రెండు కుటుంబాలకు చెందిన ఇరు వర్గాలు దాడిచేసుకోవడంతో ఆరుగురి కి గాయాలయ్యాయని ఎస్సై యాకూబ్ తెలిపారు.

ఆరుగురికి గాయాలు
నవీపేట్, డిసెంబరు 9: మండలంలోని లింగాపూర్‌లో మంగళవారం రాత్రి పొలం విషయంలో రెండు కుటుంబాలకు చెందిన ఇరు వర్గాలు దాడిచేసుకోవడంతో ఆరుగురి కి గాయాలయ్యాయని ఎస్సై యాకూబ్ తెలిపారు. గ్రామానికి చెందిన మహేష్, జీవన్ అనే రెండు కుటుంబాలకు గతం నుంచి పాత కక్షలున్నాయన్నారు. మంగళవారం రా త్రి పొలం విషయంలో రెండు కుటుంబాల వారు కర్రల తో దాడిచేసుకోవడంతో కేశపురం గంగారాం, నారాయణ, హనుమాండ్లు, వీణ, నవనీత, శోభలకు గాయాలయ్యాయ ని పేర్కొన్నారు. ఇందులో నారాయణ, హనుమాండ్లులకు తీవ్ర గాయాలయినట్లు తెలిపారు. ఈ మేరకు బాఽధిత కు టుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నట్లు తెలిపారు.