రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

ABN , First Publish Date - 2020-03-15T11:52:41+05:30 IST

జుక్కల్‌ మండల కేంద్రంలోని ధా న్యం కొనుగోలు కేంద్రంలో 5వేల కందుల బస్తాలు నిల్వ ఉండటంతో అదనపు కలెక్టర్‌

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

జుక్కల్‌, మార్చి 14: జుక్కల్‌ మండల కేంద్రంలోని ధా న్యం కొనుగోలు కేంద్రంలో 5వేల కందుల బస్తాలు నిల్వ ఉండటంతో అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి సదరు లారీల కాం ట్రాక్టర్‌పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 24 గంటల్లోపు లారీల్లో నిల్వ ఉన్న బస్తాలను సంబంధిత గోదాములకు త రలించాలని ఆయన ఆదేశించారు. శనివారం జుక్కల్‌ మండ ల కేంద్రంలో ఆయన పర్యటించారు. ముందుగా కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి పరీక్ష ల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. పరీక్ష లు రాసే సమయంలో భయాందోళనకు గురికావోద్దని, మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని పరీక్షలు రాయాలన్నా రు. అనంతరం కందుల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.  వర్షాలు పడితే కందులు తడిసి పోతాయని, అధికారులు కొ నుగోళ్లను వేగవంతం చేయాలన్నారు.  మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా కందులను తీసుకుని వచ్చి  కందుల కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే సంబంధిత అధికా రులపై చర్యలు తీసుకుంటామన్నారు. 


పెద్ద కొడప్‌గల్‌: కందుల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం పెద్ద కొడ ప్‌గల్‌ మండల కేంద్రంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని  పరిశీలించారు. సోమవారం నాటికల్లా కందుల కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఏవో నదీమోద్దిన్‌ స్థానికంగా ఉండటం లేదని కొందరు రైతులు చెప్పారు. దీంతో ఏవోపై అదనపు కలెకర్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పబోవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి నాగేంద్రయ్య, ఆర్డీవో రాజేశ్వర్‌, తహసీల్దార్‌ గణేష్‌, ఎంపీపీ ప్రతాప్‌ రెడ్డి, సర్పంచ్‌ తిర్మల్‌ రెడ్డి, సొసైటీ చైర్మన్‌ హన్మంత్‌ రెడ్డి,  కస్తూర్బా ప్రత్యేకాధికారిణి అశ్విని, సర్పంచ్‌ రాములు, డీసీవో మమత, డీటీ వెంకటేశ్‌ తదితరులున్నారు.

Updated Date - 2020-03-15T11:52:41+05:30 IST