రైతులు ధైర్యంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-10-31T06:30:03+05:30 IST

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతీ ధాన్యం గిం జను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ధై ర్యంగా ఉండాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి హామీ ఇచ్చారు

రైతులు ధైర్యంగా ఉండాలి

మొత్తం ధాన్యాన్ని  ప్రభుత్వం  కొనుగోలు చేస్తుంది

కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి


నిజామాబాద్‌ రూరల్‌, అక్టోబర్‌ 30: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతీ ధాన్యం గిం జను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ధై ర్యంగా ఉండాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం గుండారం సొసైటీ పరిధిలోని పలు గ్రామాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కాలూరు గ్రామంలో రైతులు కోస్తున్న వరి ధానాన్ని స్వయం గా రెవెన్యూ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. రైతులు వరి కోత సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తరుగు, పొల్లును వెంటది వెంటనే వేరుచేయాలని సూచించారు. ధాన్యం మి యిశ్చరైజ్‌ అయిన తర్వాతనే మిల్లులకు ధాన్యాన్ని పంపాలని సూచించారు. వరికోత పద్ధతులను ధాన్యం నష్టపోకుండా వరిని కోసే విధానాలను రైతులకు సూచించాలని వ్యవసాయ అధికారులను ఆదే శించారు. వ్యవసాయ అధికారులు, ఏఈవోలు రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని సూ చించారు. కాలూరు, గుండారం పరిసరాల్లో ఉన్న ప లు రైసు మిల్లులను తనిఖీ చేశారు. రైసు మిల్లులో ధాన్యం నిల్వలు, లారీ లోడ్‌లను అడిగి తెలుసుకున్నారు.


రైతులను ఎక్కువ సేవు ఎదురు చూసేలా చేయవద్దని, తమ వద్దకు వచ్చిన ధాన్యంను వెం టనే తీసుకోవాలని ఆదేశించారు. రైతు మిల్లుర్లుగానీ ఇతరులెవ్వరైనా తరుగు, తాలు పేరుతో దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తన దృష్టికి తీసుకువస్తే సమస్యను వెంటనే పరిష్కరిస్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. కాలూరు రైతులతో కలెక్టర్‌ కొద్దిసేపు మాట్లాడారు. వారి సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. కార్యక్రమంలో 1వ డివిజన్‌ కార్పొరేటర్‌ కొర్వ లలిత, తహసీల్దార్‌ ప్రశాంత్‌, ఏవో హీరా జాదవ్‌, ఏఈవో స్వాతిలత, జ్ఞానేశ్వర్‌, గంగాధర్‌, శ్రీనివాస్‌, తదితరులున్నారు.

Updated Date - 2020-10-31T06:30:03+05:30 IST