జిల్లాలో అమాంతం పెరిగిపోయిన కౌలు ధరలు

ABN , First Publish Date - 2020-05-24T11:26:36+05:30 IST

జిల్లా లో సాగు భూముల కు తీవ్ర డిమాండ్‌ నెల కొంది. కరోనా వైరస్‌ నేప థ్యంలో చిన్నాచి తకా వ్యాపారాలు పూర్తిగా కుంటుపడడం, మరోవైపు ప్రైవేటు ఉద్యోగాల కు భద్రత కరువవడంతో ప్రతి ఒక్కరూ వ్యవసాయం పై దృష్టి

జిల్లాలో అమాంతం పెరిగిపోయిన కౌలు ధరలు

ఏడాదికి ఎకరానికి రూ.30వేల పైనే

ఏడాదిలోనే ఎకరానికి రూ.5వేల పైనే కౌలు పెంపు 

వ్యవసాయ భూముల కోసం పోటీపడుతున్న రైతులు


బోధన్‌, మే 23: జిల్లా లో సాగు భూముల కు తీవ్ర డిమాండ్‌ నెల కొంది. కరోనా వైరస్‌ నేప థ్యంలో చిన్నాచి తకా వ్యాపారాలు పూర్తిగా కుంటుపడడం, మరోవైపు ప్రైవేటు ఉద్యోగాల కు భద్రత కరువవడంతో ప్రతి ఒక్కరూ వ్యవసాయం పై దృష్టి సారించారు. వ్యవసాయ రంగంపై కరోనా ప్ర భావం అంతగా లేకపోవడం, వ్యవసాయ పనులు య థావిధిగా కొనసాగుతుండడంతో అన్ని రంగాల వారిని వ్యవసాయం వైపునకు దృష్టి మరల్చేలా చేసింది.


నిన్నా మొన్నటి వరకు ప్రైవేటు ఉద్యోగాలు, ఇతర దూరప్రాం తాలలో ఉంటూ కుటుంబాలను నెట్టు కొచ్చిన వారు కరోనా నేపథ్యంలో స్వగ్రామాలకు చేరడంతో అందరి ఉపాధి దృష్టి వ్యవసాయంపైనే పడింది. అయితే అంద రూ వ్యవసాయం వైపు మొగ్గుచూపుతుం డడంతో భూ ములకు డిమాండ్‌ పెరిగింది. గత ఏడాది వరకు హైద రాబాద్‌ లాంటి దూర ప్రాంతాలలో స్థిరపడ్డవారి భూ ములను కౌలుకు చేసేందుకు వెనక ముందాడిన రైతు లు ఈ ఏడాది పొలం యజమానులే స్వగ్రామాలకు రా వడంతో కౌలు భూములు దొరుకక రైతులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు జిల్లాలో కౌలు భూములకు రెక్కలు వచ్చాయి. కౌలు ధరలు అమాంతం పెరిగిపో యాయి. గత ఏడాది వరకు నీటి లభ్యత ఉండి వ్యవ సాయ బోర్లు ఉన్న భూములకు ఏడాదికి ఎకరానికి రూ.20వేల నుంచి రూ.25వేల వరకు కౌలు లభించగా ఈ ఏడాది అవే భూములకు ఎకరానికి రూ. 30 నుంచి రూ.35వేల వరకు కౌలు చెల్లించేందుకు రైతులు పోటీ పడుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏడాదిలోనే ఎకరం భూమికి కౌలు ధర రూ.5వేల నుంచి రూ.10వేల వరకు పెరగడం కౌలు రైతులను ఆందో ళనకు గురి చేస్తోంది. మరోవైపు కౌలు భూముల కోసం రైతుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రైతుల మధ్య పోటీ భూ యజమానులకు కలిసి వస్తోంది.


ఈ ఏడాది విచి త్రంగా కౌలు భూములకు ముందే కౌలును చెల్లించి భూములను తీసుకుంటుండడం అయోమయానికి గు రి చేస్తోంది. గతంలో వానాకాలం పంట పండిన తరు వాత కౌలును చెల్లించే రైతులు ఈ ఏడాది పోటీ వాతా వరణంలో ముందే కౌలును చెల్లిస్తున్న తీరును చూసి విస్తుపోతున్నారు. భూ యజమానులు సైతం కౌలు రై తుల మధ్య నెలకొన్న పోటీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎవరు అధికంగా కౌలును చెల్లిస్తే వారికే భూములను ఇస్తామంటూ భూములను అప్పగి స్తున్నారు. యేళ్ల తరబడి కష్టనష్టాలను చూసి కౌలు భూములను చేస్తూ వస్తున్న రైతులు ఈ ఏడాది నెలకొ న్న పోటీ పరిస్థితులను చూసి భూములను వదులుకో వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


పరిస్థితులను తారుమారు చేసిన కరోనా.. 

కరోనా నేపథ్యంలో గత మూడు నెలలుగా మార్కెట్‌ పూర్తిగా దెబ్బతినడంతో అన్ని వర్గాల ప్రజలు వ్యవసా యం వైపు దృష్టి పెట్టారు. మరో ఏడాది వరకు కరోనా వైరస్‌ ప్రభావంతో వ్యాపారాలన్నీ పూర్తిగా కోలుకునే పరిస్థితులు లేకపోవడంతో జనం వ్యవసాయం వైపు దృష్టి మరల్చారు. సొంత భూములన్న రైతులు కౌ లుకు ఇవ్వడం ఆపివేసి వ్యవసాయంపై దృష్టి పెట్టారు. ఇన్నాళ్లు ఉపాధి కోసం ఊర్లను వదిలి పట్ట ణాలలో, దూర ప్రాంతాలలో స్థిరపడ్డవారు కరోనా వైరస్‌ కారణంగా స్వగ్రామాలకు చేరడంతో తిరిగి మళ్లీ వ్యవసాయం వైపునకు మళ్లారు. ప్రైవేటు కంపెనీలు, ఇతర రంగాలలో ఉద్యోగ అవకాశా లు దెబ్బతినడంతో నిరుద్యోగ యువత, రైతు కు టుంబాలలోని వ్యక్తులు తిరిగి మళ్లీ వ్యవసాయం పై దృష్టి పెట్టారు.


ప్రస్తుత పరిస్థితులలో అన్నింటి కన్నా వ్యవసాయం బాగుందని, ఇత ర వ్యాపారాలన్నీ కోలుకునే పరిస్థితు లు లేకపోవడంతో లాక్‌డౌన్‌ ఉన్నా.. వైరస్‌ ప్రభావం పెరిగినా వ్యవసాయానికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడే పరిస్థితి లేకపోవడంతో ప్రతి ఒక్కరూ వ్యవసాయంపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో సాగు భూములకు రెక్క లొచ్చాయి. కౌలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. భూ యజమానులు సొంతంగా భూములు చేసుకునేం దుకు ముందుకు రావడం, వివిధ వర్గాల ప్రజలు వ్యవ సాయంపై దృష్టి పెట్టడం కౌలు ధరలు పెరిగేలా చేశా యి. యేళ్ల తరబడిగా వ్యవసా యాన్నే నమ్ముకున్న కౌ లు రైతులు ప్రస్తుత కౌలు ధరలను చూసి లోదిబోమంటున్నారు.

Updated Date - 2020-05-24T11:26:36+05:30 IST