యథేచ్ఛగా సాగుతున్న ఇసుక, మొరం తవ్వకాలు
ABN , First Publish Date - 2020-02-28T11:45:05+05:30 IST
ఇసుక, మట్టి, మొరం అక్రమ రవాణాపై నిజామాబాద్ జిల్లాలో ని ఘా కరువైంది. అభివృద్ధి మాటున అనుమ తితో నిత్యం ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వా రా బాహటంగానే తరలిస్తున్నారు.
రాత్రివేళల్లో గుట్టు చప్పుడు కాకుండా తరలింపు
పలు గ్రామాల్లో శివారు ప్రాంతాల్లో డంప్‌లు వేస్తున్న వైనం
మూడు మున్సిపాలిటీల్లో చక్రం తిప్పుతున్న పలువురు నేతలు
ఇసుక, మట్టి, మొరం అక్రమ రవాణాపైకరువైన నిఘా
రాజకీయ నేతల ఒత్తిడిలతోపట్టించుకోని అధికారులు
ఇసుక, మట్టి, మొరం అక్రమ రవాణాపై నిజామాబాద్ జిల్లాలో ని ఘా కరువైంది. అభివృద్ధి మాటున అనుమ తితో నిత్యం ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వా రా బాహటంగానే తరలిస్తున్నారు. బహిరంగ మార్కెట్లలో అమ్మేస్తున్నారు. నగర కార్పొరేష న్, మున్సిపాలిటీల శివారులలో కొన్ని చోట్ల డంప్‌ల నుంచి వాహనాల ద్వారా అవసరమై న చోటుకు తరలిస్తున్నారు. అనుమతులు లేవని ఎక్కువ రేట్లకు ఇసుక, మట్టి మొరం విక్రయిస్తున్నారు. రాజకీయ అండదండలు ఉండడంతో అక్రమ తవ్వకందారులు ద ర్జాగా తరలిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో అ ధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరి స్తున్నారు. జిల్లాలో అప్పుడప్పుడు వాహనాల ను సీజ్ చేస్తూ అధికారులు కేసులు నమో దు చేస్తున్నారు. జిల్లాలో నిత్యం నిఘా లేక పోవడంతో పలు చోట్ల గుట్టలను కూడా త వ్వకాలను చేస్తున్నారు. కొన్ని రోజులు పోతే అవి కూడా మాయమయ్యే పరిస్థితులు కని పిస్తున్నాయి. జిల్లాలో ఇసుక తవ్వకాలకు టీఎస్ ఎండీసీ అనుమతులు ఇచ్చారు. మం జీరా వెంట ఈ తవ్వకాలకు కోటగిరి, బోధన్ మండలాల పరిధిలోని ఐదు చో ట్ల క్వారీలకు అను
మతి ఇచ్చారు. ఆన్ లైన్‌లో అనుమతి తీసుకు న్న వారికి టీఎస్ ఎండీసీ ద్వారా లారీలలో సరఫరా చే స్తున్నారు. క్యూబిక్ మీటర్‌కు లెక్కన చాలాన్ ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. మంజీరా వెంట తవ్వకాలు చేయడం వల్ల రోడ్లు, పం ట పొలాలు దెబ్బతింటున్నాయని బోధన్ మండలం హున్సా గ్రామానికి చెందిన వారు ధర్నాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌కు ఫి ర్యాదు చేశారు. కోటగిరి, బోధన్ మండల ప రిధిలోని పోతంగల్, మందర్నా క్వారీల ద్వా రా వేబిల్లలు ఉన్న వాటికే అనుమతి ఇవ్వాలి. టీఎస్‌ఎండీసీ అధికారులు తవ్వకాలకు వేరే వారికి అప్పజెప్పడంతో కొంత అక్రమంగా కూడా తరలివెళ్లిపోయింది. తమకు వచ్చిన సమాచారంతో బోధన్ పోలీసులు పది రోజుల క్రితం వాహ నాల తనిఖీలు చేయ గా వే బిల్లులు లే కుండా తరలి స్తుండడం తో వాటిని పట్టుకొని సీజ్ చేశారు. ఒకేరోజు అది గంట పాటు తనిఖీ చేస్తేనే 5 వాహనాలు దొరికాయి. ప్రతీరోజు చేస్తే ఇం కా ఎక్కువగా అక్రమంగా తరలిస్తున్న వాహ నాలు దొరికే అవకాశం ఉంది. రెవెన్యూ, పో లీసు, అటవీ, మైనింగ్, ఇరిగేషన్ శాఖ అధి కారులపై రాజకీయ ఒత్తిడిలు ఉండడంతో నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ప్ర భుత్వ అవసరాల కోసం డిచ్‌పల్లి, ధర్పల్లి, భీ మ్‌గల్, వేల్పూర్, జక్రాన్‌పల్లి, ఆర్మూర్, మా క్లూర్, నందిపేట, మోపాల్, నవీపేట మండ ల పరిధిలోని వాగుల నుంచి బుధ, శుక్రవా రాలు రెవెన్యూ అఽధికా రులు అనుమతి ఇ స్తున్నారు. ఇవి మినహా ఇతర అనుమ తులు ఇవ్వడం లేదు. అఽధికారుల కళ్లుగప్పి రాత్రివేళల్లో ఇసుక తరలిస్తున్నారు.
కొన్ని చో ట్ల తహసీల్దార్‌లు అనుమతి ఇచ్చినా విచ్చల విడిగా తవ్వకాలు చేస్తున్నారు. గుట్టలను మాయం చేస్తున్నారు. గతంలో రైల్వేలైన్ కో సం అనుమతి లేకుండా మట్టిని తరలి రా వడంతో కేంద్ర పర్యావరణ ట్రిబ్యునల్ వరకు కేసు వెళ్లింది. రాష్ట్ర విజిలెన్స్ అధికారులు వ చ్చి తనిఖీ చేసి వెళ్లారు. జిల్లాలోని నిజామా బాద్ రూరల్, మోపాల్, డిచ్‌పల్లి, జక్రాన్‌ప ల్లి, మాక్లూర్, నవీపేట, ఎడపల్లి, ఆర్మూర్ రూరల్ మండలాల పరిఽధిలో ఈ తవ్వకాలు ఎక్కువగా ఉన్నాయి. నందిపేట పలుగుట్ట సమీపంలో అనుమతులు లేకుండానే భారీగా తవ్వకాలు జరిగాయి. ఆర్మూ ర్, నిజామాబాద్, బోధన్ మున్సిపా లిటీల పరిధిలో రియల్ ఎస్టేట్‌కు ఎ క్కువగా అవసరం ఉండడంతో అధికార పార్టీ అండదండలతో కొంత మంది ఈ దందాను ఎక్కువగా చేస్తున్నారు. ట్రాక్టర్‌లు, టిప్పర్‌ల ద్వారా అమ్మకాలు చేస్తున్నారు. ప్ర జాప్రతినిధుల పేరు చెప్పి తమకు అడ్డం రా కుండా చూసుకుంటున్నార. కిందిస్థాయిలో అధికారులను దగ్గరగా చేసుకొని దందా కొన సాగిస్తున్నారు. ఈ మూడు మున్సిపాలిటీల పరిధిలో కొంత మంది ఇదే వృత్తిగా చే సుకొని పనిచేస్తున్నారు. జిల్లా లోని కొన్ని కీలకమైన శాఖల లో సిబ్బంది లేకపోవడం వల్ల ప ర్యవేక్షణ కూడా కరువవుతోంది. అనుమతి ఇ చ్చినా చోట కాకుండా అక్రమ తవ్వకాలపై దృష్టి పెడితే సహజ వనరులు భావి తరాల కు అందుబాటులో ఉండనున్నాయి.
జిల్లా క లెక్టర్ ఈ అక్రమ త వ్వకాలపైన దృష్టి పెడితే ఆగే అవకా శం ఉంది. మండ లాల పర్యటనలో భాగంగా ఆకస్మికంగా త నిఖీ చేస్తున్న కలెక్టర్ దారి వెంట ఉన్న గు ట్టలను పరిశీలిస్తే కొంత మేరకు ఆగే అవకా శాలున్నాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇసుక, మట్టి తవ్వకా లకు కొన్ని చోట్ల రెవెన్యూ అదికారులు అను మతులు ఇచ్చారని జిల్లా భూగర్భ శాఖ అధి కారి సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో ఎ న్ని చోట్ల గుట్టలు తవ్వకాలు జరిగాయో త మ వద్ద సమాచారం లేదన్నారు. తమకు సి బ్బంది లేకపోవడం వల్ల తవ్వకాలు చేయలే కపోతున్నామన్నారు. మట్టి తవ్వకాలకు మా క్లూర్, నిజామాబాద్ రూరల్ పరిధిలో అను మతులున్నాయని ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో తెలిపారు.