పల్లె ప్రగతి పనుల పరిశీలన

ABN , First Publish Date - 2020-03-18T11:35:03+05:30 IST

మాచారెడ్డి మండలం భవానిపేట్‌, ఆరేపల్లి గ్రామాల్లో మంగళవారం పల్లె ప్రగతి పనులను రాష్ట్ర స్పెషల్‌ ప్లయింగ్‌

పల్లె ప్రగతి పనుల పరిశీలన

మాచారెడ్డి, మార్చి 17: మాచారెడ్డి మండలం భవానిపేట్‌, ఆరేపల్లి గ్రామాల్లో మంగళవారం పల్లె ప్రగతి పనులను రాష్ట్ర స్పెషల్‌ ప్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి అశోక్‌కుమార్‌ సిన్హా పరిశీలిం చారు. మొదటి గ్రామపంచాయతీలో పాలకవర్గం ప్రజలతో సమావేశమై పల్లె ప్రగతిలో నిర్వహిం చిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామాల్లో నిర్వహించిన నర్సరీని, శ్మశానవాటికను డంపింగ్‌యార్డు, రెవెన్యూ ప్లాం టేషన్‌, వర్మికాంపోండ్‌ సెట్‌ నిర్మాణాలను పరిశీ లించారు. ఎన్ని మొక్కలు నాటారు ఏఏ పనులు చేపట్టారు. వంద శాతం పూర్తి చేశారా లేదా అడిగి తెలుసుకున్నారు. 


ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు పూర్తయ్యాయా అని, వాటిని ఉపయోగిస్తున్నారా లేదా తెలు సుకున్నారు. గ్రామసర్పంచ్‌, అధికారులను పనుల వివరాలను అడిగి నమోదు చేసుకున్నారు. భవ నిపేట్‌ గ్రామంలో పనులు సంతృప్తికరంగా చేశా రని కితాబు ఇచ్చారు. కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీలు సర్పంచ్‌లు మద్దెలరాజు, లింగారెడ్డి, ఎప్‌ఆర్‌వో ఆమర్‌సింగ్‌, రేంజ్‌ అధికారి సుజాత, సెక్షన్‌ అధికారులు శంకర్‌,నరేష్‌, ఎంపీ డీవో శ్రీకాంత్‌,ఎంపీవో లక్‌పతినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-18T11:35:03+05:30 IST