సర్వం కల్తీ!

ABN , First Publish Date - 2020-12-07T05:30:00+05:30 IST

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మార్కెట్‌లో కల్తీ ఆహారపదార్థాల విక్రయాలు జోరందుకుంటున్నాయి. రోజురోజుకూ సరికొత్త రుచులకు అలవాటు పడుతున్న ప్రజలను ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది నిర్వాహకులు వాటిని విక్రయించి కొన్ని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌సెంటర్లు, బిర్యానీ పాయింట్లు, దాబాలు, మెస్‌లు, బేకరీలు, కిరాణాషాపుల్లో లభించే పలురకాల సరకులు ఇలా.. రుచికోసం వెళ్లి తిందామనే ప్రతీ వస్తువులో శుభ్రత కరువైందని, వీటిని తినాలన్నా, కోనాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్న విమర్శలున్నా యి.

సర్వం కల్తీ!

కామారెడ్డి జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల జోరు
కానరాని సంబంధిత శాఖాధికారుల తనిఖీలు
రుచికోసం వెళితే శుచిలేని వైనం
నాణ్యతా ప్రమాణాలు పాటించక ప్రజల ప్రాణాలతో చెలగాటం
పట్టించుకోని అధికార యంత్రాంగం

కామారెడ్డి, డిసెంబరు 7: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మార్కెట్‌లో కల్తీ ఆహారపదార్థాల విక్రయాలు జోరందుకుంటున్నాయి. రోజురోజుకూ సరికొత్త రుచులకు అలవాటు పడుతున్న ప్రజలను ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది నిర్వాహకులు వాటిని విక్రయించి కొన్ని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌సెంటర్లు, బిర్యానీ పాయింట్లు, దాబాలు, మెస్‌లు, బేకరీలు, కిరాణాషాపుల్లో లభించే పలురకాల సరకులు ఇలా.. రుచికోసం వెళ్లి తిందామనే ప్రతీ వస్తువులో శుభ్రత కరువైందని, వీటిని తినాలన్నా, కోనాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్న విమర్శలున్నాయి. చాలా మంది కనీస ప్రమాణాలు సైతం పాటించకపోవడంతో ప్రజలు అనారోగ్యపాలవుతున్నారని ఆరోపణలు వినిపి స్తున్నాయి. రోజురోజుకూ వందల కొద్ది వెలుస్తున్నప్పటికీ వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు మాత్రం కొన్నింటికి మాత్రమే ఉన్నాయని సమాచారం. మిగిలినవన్నీ కూడా వారి ఇష్టారాజ్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎలాంటి అనుమతులు లేకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తినుబండా రాలను తయారుచేసి, విక్రయిస్తున్నవారిపై సంబంధిత శాఖధి కారులు ఏమేర దాడులు చేస్తున్నారు? ఎంత వరకు నాణ్యత ప్రమాణాలు లేనివాటిపై చర్యలు తీసుకుంటున్నారు. వీరి పర్య వేక్షణ ఎంతమేరకు సాగుతోంది? అన్న విషయంపై సంబంధిత శాఖధికారులు దృష్టిసారిస్తే అపరిశుభ్ర వాతావరణంలో తినుబంబారాలను తయారుచేసే, విక్రయించే షాపులతో పాటు కల్తీ సరుకులు విక్రయించే వారికి అడ్డుకట్టవేస్తే ప్రజలు రోగాల బారినపడకుండా ఉంటారని జిల్లా వాసులు కోరుతున్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం
కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్లలోని అనేక మండలాల పరిధిలో హోటళ్లు, ఫాస్ట్‌పుడ్‌ సెంటర్లు, మెస్‌లు, బేకరీలు, దాబాలు, ఆర ుుల్‌షాపుల యజమానులు, తినుబండారాలను తయారుచేసి విక్రయించే వారు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నార ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో వందల సంఖ్యలో వెలుస్తున్న పలుషాపుల్లో అపరిశుభ్రమైన వాతావరణంలో పలు తినుబండారాల తయారీ, విక్రయాలు జరుగుతున్నాయని దీంతో మార్కెట్‌లో ప్రతీది కల్తి అవుతోందన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. తమ వ్యాపారంలో అధిక లాభార్జనే ధ్యేయంగా కొంతమంది కల్తీసరుకులు, పుడ్‌ ఐటెంలు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో చాలామంది టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, మెస్‌లు, సాయంత్రం పూట రోడ్డుపై తినుబండారాలను విక్రయించే వారిలో చాలామంది కనీస నా ణ్యతా ప్రమాణాలను పాటించకుండానే కళ్లముందర ఆహారప దార్థాలను తయారుచేస్తున్నారని ఆరోపణలున్నాయి.
పల్లీ నూనె కల్తీలేనిదేనా?
అపరిశుభ్రమైన స్థలం, కల్తీనూనెలతో ఆహార పదార్థాలు తయారుచేస్తున్నారు. అసలే కరోనా కాలం అందులోనూ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి గురవడంతో సమయానికి తిండిలేక, నిద్రలేక ఊబకాయులుగా మారుతున్న వైనం. అలాంటి సమయంలో ప్రజలు ఎంతో కొంతైనా మనం వినియోగిస్తున్న పల్లినూనె కల్తీలేనిదేనా అని ఎవరైనా ఆలోచన చేస్తున్నారా అనేది సందేహం. ఎందుకంటే ఈ కల్తీనూనె ప్రక్రియ అంతా కామారెడ్డి జిల్లా కేంద్రంతో పా టు మాచారెడ్డి మండలం వద్ద గల ఓ గ్రామం వద్ద ఇటీవల నెలకొల్పిన ఆయిల్‌ ఫ్యాక్టరీలో నూనె ఎంతమేర కల్తీ అవుతుందనేది పట్టణంలోని చోటా మోటా నాయకుల నుంచి కార్యకర్తలు, వ్యాపారాలకు అందరికీ తెలిసినా వాటిపై నిలదీసేవారు లేకపోవడంతో తమకు నచ్చిన విధంగా పల్లి నూనెను కల్తీచేస్తూ పట్టణ ప్రజలతో పాటు జిల్లాలో పలు మండలాలకు, ఇతర రాష్ట్రాలకు కల్తీనూనె సరాఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము ఇష్టంగా తినే పదార్థాలే కల్తీ ఆయిల్‌ వల్ల ప్రాణాల మీదకు అపాయాన్ని తెచ్చే పరిస్థితులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కానరాని అధికారుల పర్యవేక్షణ
జిల్లావ్యాప్తంగా అనేక రకాల ఆహారపదార్థాలు, సరుకుల విక్రయతయారీ కేంద్రాలు వెలుస్తున్నా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌లు మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యతాప్రామాణాలను పట్టించుకోకుండా వ్యాపారాలు కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యాలను దెబ్బతిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఎవరైనా సందర్బాను సారంగా తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఫిర్యాదులు చేస్తే మాత్రం అలా వచ్చి ఇలా తనిఖీల పేరుతో ఫొటోలు తీసుకుని వెళ్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్న కల్తీనూనె, ఆహారపదార్థాల విక్రయదారులు, తయారీదారులపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు చేసి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-12-07T05:30:00+05:30 IST