ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2020-12-02T05:17:33+05:30 IST

వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని ప్రాజెక్టు ఆఫీసర్‌ డాక్టర్‌ తుకారం అన్నారు.

ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
రెంజల్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న సిబ్బంది

ఇందల్వాయి, డిసెంబరు 1: వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని ప్రాజెక్టు ఆఫీసర్‌ డాక్టర్‌ తుకారం అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలతో కలిసి సమావేశం ఏ ర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎయిడ్స్‌ ఎలా సంక్రమిస్తుందనే విషయాన్ని ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు. లైంగిక సంబంధాలతోనే వ్యాధి సోకే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ప్రతీ శుక్రవారం ఫ్రైడే కార్యక్ర మం చేయాలని కోరారు. మలేరియా, ఫైలేరియా, డెంగీ, చికెన్‌గున్యా వంటి వ్యా ధులు రాకుండా కాపాడవచ్చని సూచించారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి శం కర్‌, ఆరోగ్య పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. 

మండలకేంద్రంలో అవగాహన ర్యాలీ..

నవీపేట: ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా మంగళవారం మండల కేం ద్రంలో ర్యాలీ నిర్వహించారు. చైల్డ్‌ ఫండ్‌ ఇండియా లింక్స్‌ వర్కర్స్‌ టీం ఆధ్వర్యం లో ర్యాలీ కొనసాగింది. అనంతరం 16 మంది నిరుపేదలకు పది కిలోల చొప్పున బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఏటీఎస్‌ శ్రీనివాస్‌, చైల్డ్‌ ఫండ్‌ ఇండియా లింక్‌ వర్కర్స్‌ ఒడ్డె రవి, సూపర్‌వైజర్‌ నారాయ ణ, నవీపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపర్‌వైజర్‌లు దేవేందర్‌, కిషన్‌ పాల్గొన్నారు.

టెస్టు చేయించుకోవాలి

రెంజల్‌: ప్రతిఒక్కరూ హెచ్‌ఐవీ టెస్టు చేయించుకోవాలని రెంజల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ క్రిస్టీనా అన్నారు. మంగళవారం ఎయిడ్స్‌ దినం సం దర్భం గా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T05:17:33+05:30 IST