‘ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది’
ABN , First Publish Date - 2020-04-08T11:13:25+05:30 IST
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభు త్వమే కొనుగోలు చేస్తుందని ఎంపీపీ రమేష్‌నాయక్ అన్నారు.

ఇందల్వాయి, ఏప్రిల్ 7: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభు త్వమే కొనుగోలు చేస్తుందని ఎంపీపీ రమేష్‌నాయక్ అన్నారు. ఇందల్వాయి పీఏ సీఎస్ పరిధి మెగ్యానాయక్ తండాలో మంగళవారం సొసైటీ ఛైర్మన్ చింతలపల్లి గోవర్ధన్‌తో కలిసి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందల్వాయి సొసైటీ పరిధిలోని ప్రతి గ్రామంలో త్వరలోనే వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామ న్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వరి, మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు.
వరికి రూ.1,835, మొక్కజొన్నకు రూ.1,760ల మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గుంపులుగా ఉండవద్దని, తమకు వచ్చిన టోకెన్ నెంబర్ ప్రకారం ధాన్యాన్ని తూకం వేయిం చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మారుతి నాయక్, స్థానిక సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ లలిత, గన్నారం సర్పంచ్ మోహన్‌రెడ్డి, డైరెక్ట ర్లు దాసు, రాంరెడ్డి, ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు.