ప్రతీ మనిషి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2020-12-26T05:27:42+05:30 IST

ప్రతీ మనిషి ఆఽ ద్యాత్మిక చింతన కలిగి ఉండాలని, దైవదర్శనం చేసుకుంటూ సన్మార్గంలో పయనిస్తూ సాటివారిని నడిపించాలని హంపి పీఠాధిపతి విరుపాక్ష వి ద్యారణ్య భారతీ స్వామి అన్నారు.

ప్రతీ మనిషి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి
ప్రవచనం చేస్తున్న స్వామీజీ

హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి

కమ్మర్‌పల్లి, డిసెంబరు 25: ప్రతీ మనిషి ఆఽ ద్యాత్మిక చింతన కలిగి ఉండాలని, దైవదర్శనం చేసుకుంటూ సన్మార్గంలో పయనిస్తూ సాటివారిని నడిపించాలని హంపి పీఠాధిపతి విరుపాక్ష వి ద్యారణ్య భారతీ స్వామి అన్నారు. వైకుంఠ ఏకా దశి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలో ని హసాకొత్తూర్‌లో ఇటీవల నూతనంగ నిర్మిం చిన జగదంబాదేవి(శుక్రవారం దేవి) ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యే క పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. అనం తరం అక్కడున్న భక్తులకు ప్రసాదం పంపిణీ చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ మనిషి ఉదయం లేచిన మొదలు పడుకొ నేవరకు తనకేదో కావాలన్న తపన పడుపుతుంటాడని, మనశ్వాంతి కోసం ఏవో దారులు వెతుకుం టాడని అన్నారు. కానీ అన్ని సమకూర్చే భగవంతుని దర్శించుకుంటే అన్ని సౌక్యంగా జరుగు తాయన్న విషయాన్ని తెలుసుకోలేక పోతున్నాడన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నోముల రజీత,  నోములనరేందర్‌ రెడ్డి, వీడీసీ సభ్యులు, అర్చకులు రమణచారి, భక్తులు, గ్రామస్థులు శుక్రవారం ప్రత్యేక పూజలనిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-26T05:27:42+05:30 IST