అవగాహన పెరుగుతోంది!

ABN , First Publish Date - 2020-12-01T05:51:41+05:30 IST

ఉమ్మడి జిల్లాలో హెచ్‌ఐవీపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. శరీరంలోని ఏ వ్యవస్థపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది? హెచ్‌ఐవీ సోకినప్పుడు ఎలాం టి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ మందులు వాడాలి? అ నే అంశాలపై అందరికీ అవగాహన ఉంది. దీంతో గ తంలో కంటే మరణాల సంఖ్య తగ్గింది. భయం కూడా తొలిగిపోయింది. హెచ్‌ఐవీ సోకిన గతంలో నలుగురి తో కలవాలన్నా భయపడేవారు.

అవగాహన పెరుగుతోంది!

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తగ్గుముఖం పడుతున్న హెచ్‌ఐవీ 

గత ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు నిజామాబాద్‌ జిల్లాలో 161 మందికి, కామారెడ్డి జిల్లాలో 105 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ

తల్లి నుంచి బిడ్డకు సోకకుండా కాపాడుతున్న ఉమ్మడి జిల్లా వైద్యులు

నేడు ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం

కామారెడ్డి టౌన్‌, నవంబరు 30: ఉమ్మడి జిల్లాలో హెచ్‌ఐవీపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. శరీరంలోని ఏ వ్యవస్థపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది? హెచ్‌ఐవీ సోకినప్పుడు ఎలాం టి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ మందులు వాడాలి? అ నే అంశాలపై అందరికీ అవగాహన ఉంది. దీంతో గ తంలో కంటే మరణాల సంఖ్య తగ్గింది. భయం కూడా తొలిగిపోయింది. హెచ్‌ఐవీ సోకిన గతంలో నలుగురి తో కలవాలన్నా భయపడేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. అవగాహన పెరగడంతో నిజామాబాద్‌ జన రల్‌ ఆస్పత్రితో పాటు ఆర్మూర్‌, వర్ని, బోధన్‌లలో, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి,బాన్సువాడ ఏరియా ఆసుపత్రులలో ఏర్పాటు చేసిన ఏఆర్‌టీ సెంటర్‌లకు బాధితులు స్వచ్ఛందంగా వచ్చి చికిత్స పొందుతున్నారు. 

హెచ్‌ఐవీ ఎలా వ్యాపిస్తుందంటే..

సాధారణంగా అనైతిక లైంగిక సంపర్కం, రక్తం ఎక్కించినప్పుడు, లాలాజలం, జననాంగ స్రావాల వం టి వాటితో హెచ్‌ఐవీ వ్యాపిస్తుంది. హెచ్‌ఐవీ అంటు వ్యాధి కాదు. అది వైరస్‌ వల్ల వ్యాపించే వ్యాధి. వైరస్‌ సోకిన వ్యక్తి రక్తంను మరొకరికి ఎక్కించినా.. హెచ్‌ఐవీ సోకిన తల్లి మందులు వాడకుండా బిడ్డకు చనుపాలు ఇచ్చినా బిడ్డకు సైతం సోకుతుంది. నెల రోజుల పాటు  తగ్గకుండా జ్వరం రావడం.. బరువు తగ్గిపోవడం.. ఎక్కువ రోజులు విరోచనాలు కావడం.. అదే పనిగా ద గ్గు రావడం.. మందులు వేసుకున్నా తగ్గకపోవడం.. ఎప్పుడూ ఇన్పెక్షన్‌ రావడం వంటి లక్షణాలు హెచ్‌ఐవీ సోకిన వ్యక్తిలో కనిపిస్తాయి. రక్తంలోని తెల్లరక్త కణా ల్లో సీడీ-4 సంఖ్యను బట్టి హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ను గుర్తిస్తారు. ఒక మిల్లి లీటరు రక్తంలో సీడీ-4 కణాల సం ఖ్య 500 లేదా అంతకంటే తక్కువ ఉంటే హెచ్‌ఐవీ సోకి రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిన్నట్లు గుర్తిస్తారు.

అవగాహన తప్పనిసరి

మానవ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో సీడీ-4 కణాలు ఎంతో కీలకమైనవి. హెచ్‌ఐవీ పాజిటివ్‌ బాధితుల్లో వైరస్‌ సీడీ-4 కణాలపై దాడి చేస్తుంది. ఫలితం గా రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. ఆ వైరస్‌ ప్రభావంను తగ్గించేందుకు ప్రతి నెలా అందిం చే మందులను క్రమం తప్పకుండా వాడాలి. ముఖ్యం గా స్త్రీలు గర్భం దాల్చినప్పుడు తమ పిల్లలకు ఆ వ్యా ధి సోకకుండా వైద్యుల సూచనలు పాటించాలి. గతం లో హెచ్‌ఐవీ సోకిన వారిని సమాజం దూరంగా ఉం చేది. ప్రస్తుతం హెచ్‌ఐవీపై అవగాహన పెరగడంతో ధైర్యంగా ముందుకు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. ఫలితంగా మధుమేహం, హైపర్‌ టెన్షన్‌ వ్యా ధుల లాగానే ఎయిడ్స్‌ హెచ్‌ఐవీని నియంత్రించి దీర్ఘకాలికంగా జీవితాన్ని పెంచే వ్యాధిగా గుర్తిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 6,895 మంది బాధితులు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 6,895 మంది హె చ్‌ఐవీ బాధితులు ఏఆర్‌టీ కేంద్రాలలో నమోదు చేయి ంచుకొని మందులు వాడుతున్నారు. ఇందులో నిజా మాబాద్‌ జిల్లాలో 4,022 మంది, కామారెడ్డిలో 2,873 మంది ఉన్నారు. గత ఏప్రిల్‌ మాసం నుంచి అక్టోబరు వరకు నిజామాబాద్‌ జిల్లాలో 22,659 మందికి హెచ్‌ ఐవీ పరీక్షలు చేయగా.. అందులో 161 మందికి, కామా రెడ్డి జిల్లాలో 19,763 మందికి పరీక్షలు చేయగా 105 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. వారికి రూ. 2,016ల చొప్పున ఆసరా పింఛన్‌ అందిస్తున్నారు. నిజా మాబాద్‌ జిల్లాలో 2,419 మంది, కామారెడ్డి జిల్లాలో 2,027 మంది లబ్ధిపొందుతున్నారు. జిల్లా ఎయిడ్స్‌ ని యంత్రణ బృందం అవగాహన కార్యక్రమాలు పెంచడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 సంవత్సరాలుగా హెచ్‌ఐవీ కేసులు 5.25 శాతం నుంచి 0.64 శాతానికి తగ్గుముఖం పట్టాయి. కాగా, హెచ్‌ఐవీ సోకిన గర్భిణు ల నుంచి వారి పిల్లలకు సోకకుండా నిజామాబాద్‌లో 14 మందిని, కామారెడ్డిలో 10మంది శిశువులకు వైద్య బృందం కాపాడింది.

అవగాహన కల్పిస్తున్నాం..

చంద్రశేఖర్‌, డీఎంఅండ్‌హెచ్‌వో, కామారెడ్డి  

హెచ్‌ఐవీపై ప్రజలకు అవ గాహన కల్పిస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని జనరల్‌ ఆసుపత్రి, ఆర్మూర్‌, బోధన్‌, కామారెడ్డి, బాన్సువాడలో ఏఆర్‌టీలతో పాటు మద్నూర్‌, ఎల్లారెడ్డిలో లింక్‌ ఏఆర్‌టీ సెంటర్లతో పాటు గాంధారిలో ఎయిడ్స్‌ చికిత్స కేంద్రాలున్నాయి.  వ్యాధి సోకినవారు క్రమం తప్పకుండా మందులు వా డాలి. హెచ్‌ఐవీకి మెరుగైన చికిత్స అందు బాటులోకి వచ్చింది. ప్రస్తుతం హెచ్‌ఐవీ పాజిటివ్‌ వచ్చిన వారు ధైర్యంగా వచ్చి మందులు వాడడం శుభపరిణామం. గర్భిణులు తప్పని సరిగా హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలి. వారికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉం టే గర్భస్థ శిశువులకు సోకుతుంది.

Updated Date - 2020-12-01T05:51:41+05:30 IST