‘పది’ పరీక్షలకు 102 కేంద్రాల ఏర్పాటు : డీఈవో
ABN , First Publish Date - 2020-05-29T11:12:25+05:30 IST
కామారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వాహణకు 102పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఈవో రాజు

లింగంపేట, మే 28: కామారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వాహణకు 102పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఈవో రాజు తెలిపారు. గురువారం లింగంపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జూన్‌లో నిర్వహించే ప దోతరగతి పరీక్షలకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
గతంలో జి ల్లాలో 60 పరీక్ష కేంద్రాలు ఉండగా అదనంగా మరో 42 పరీక్ష కేంద్రాలను ఏ ర్పాటు చేశామని, విద్యార్థులు భౌతికదూరం పాటించి పరీక్షలు రాసేలా ఏర్పా టు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రంలోని గదులను ప్రతీరోజు శా నిటైజ్ చేస్తామని, ప్రతీ విద్యార్థికి మాస్క్‌ను అందజేస్తామని, 12 మంది విద్యా ర్థులకు ఒక ఇన్వీజీలేటర్ను నియమించామని ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం 12751మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఏసీజీఈ లింగం, ఎంఈవో రామస్వామి ఉన్నారు.
పుస్తకాల విక్రయానికి అనుమతి తీసుకోవాలి
కామారెడ్డిటౌన్: 2020-21 సంవత్సరానికి గాను జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల లకు అవసరమైన పాఠ్యపుస్తకాలను విక్రయించేందుకు అనుమతి తీసుకోవాల ని డీఈవో రాజు తెలిపారు. ఉపవిద్యాశాఖధికారి కార్యాలయంలో తమ వివరా లు నమోదు చేయించుకోని అనుమతి పొందాలని, పుస్తక విక్రయకేంద్ర రిజిస్ట్రే షన్ పత్రాలు, అడ్రస్ ప్రూఫ్‌తోపాటు రూ.2000డీడీ రూపంలో చెల్లించి జూన్ 15లోపు అందించాలని సూచించారు. అనుమతి లేకుండా జాతీయ పాఠ్యపుస్త కాలను అమ్మకాలు జరిపితే చట్టరిత్యా కఠినచర్యలు తీసుకుంటామని, నిబంధ లను అన్నీ ప్రైవేటు పాఠశాలలను పాఠించాలన్నారు.