ఎస్సారెస్పీ నీటి విడుదల
ABN , First Publish Date - 2020-12-29T05:29:14+05:30 IST
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాల ువలకు నీటిని విడుదల చేసినట్లు ఎంపీపీ బురుకల సుకన్య, జడ్పీటీసీ తలారి గంగాధర్, డీసీసీబీ డైరెక్టర్ నాగంపేట్ శేఖర్ తెలిపారు.

మెండోర, డిసెంబరు28: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాల ువలకు నీటిని విడుదల చేసినట్లు ఎంపీపీ బురుకల సుకన్య, జడ్పీటీసీ తలారి గంగాధర్, డీసీసీబీ డైరెక్టర్ నాగంపేట్ శేఖర్ తెలిపారు. కాక తీయ, లక్ష్మీ, వరదకాలువలకు ప్రాజెక్టు ఎస్‌ఈ సుశీల్, జెన్‌కో ఎస్‌ఈ నాగేశ్వర్‌రావుతో కలిసి వారు నీటిని విడుదల చేశారు. కాకతీయ కాలు వకు ఉదయం 2000క్యూసెక్కల నీటిని విడుదల చేయగా క్రమంగా 5500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. లక్ష్మీకాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరదకాలువకు 1000 క్యూ సెక్కుల నీటిని విడుదల చేయగా క్రమక్రమంగా 3000క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మిస్బా, ఎంపీటీసీ జాన్‌బాబు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సాయారెడ్డి, ప్రాజెక్టు డీఈ జగదీష్, జెన్‌కో డీఈ శ్రీనివాస్, రైతులు ఏలేటి శ్రీనివాస్, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
రామడుగు నుంచి నీటి విడుదల
ధర్పల్లి: మండలంలోని రామడుగు ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నీటిని సోమవారం విడుదల చేశారు. ఆయకట్టు కింద ఉన్న ఏడు వేల ఎకరాలకు యాసంగి పంట కోసం నీటిని విడుదల చేశామఇ ఎమ్మెల్యే అన్నారు. ప్రాజెక్టులో బోటింగ్ కోసం తన వంతు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జగన్, ఎంపీపీ సారికా, సర్పంచ్ పుష్ప సుబేంధర్, వైస్ ఎంపీపీ నవీన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.